వంద శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా?
హైదరాబాద్: గ్యాస్ రాయితీ, నగదు బదిలీ పథకం చట్టవిరుద్దమంటూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. గ్యాస్ రాయితీ, నగదు బదిలీపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 100 శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా అని చమురు కంపెనీలను ధర్మాసనం ప్రశ్నించింది. అసంబద్ద విధానాల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. రాయితీ బదిలీ కోసం ఎంత మంది బ్యాంకు ఖాతాలు కలిగివుంటారని చమురు సంస్థలను ప్రశ్నించింది.
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ పేట్ల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. నంబర్ పేట్ల కాంట్రాక్టును ఒక్కరికే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్పై కోర్టు ఈవిధంగా స్పందించింది.