money tranfer scheme
-
ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ కు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ అనుసంధా నం ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌పీసీఎల్)లో మ్యాపింగ్ కానీ వివరాలు సేకరించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరికి ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్ అనుసంధానం చేయాలని, ప్రస్తుతం జిల్లాలో 92 శాతం అనుసంధానం పూర్తయిం దని తెలిపారు. జిల్లాలో 3,47,706 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 3,14,904 కనెక్షన్లు అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 28 వేలకుపైగా ఆయిల్ కంపెనీల డాటా బేస్‌లో సీడింగ్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ అనుసంధానం కోసం బ్యాంకులకు వచ్చిన బండిల్స్ పూర్తి చేయాలని చెప్పారు. ఆయా ఏజెన్సీల పరిధిలో సీడింగ్ కానీ కనెక్షన్లు సీడింగ్ చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహశీల్దార్లను ఆదేశించారు. పనితీరు మెరుగుపడకుంటే తొలగించి కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించారు. ఈ నెల 28వ తేదీలోగా మ్యాపింగ్, సీడింగ్ పూర్తి చేసి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. జిల్లాలో 12,203 దీపం కనెక్షన్లు మంజూరు కాగా, 9,429 కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని, మిగతా 2,700 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహశీల్దార్లు రేషన్‌కార్డుకు ఆధార్ సీడింగ్, అమ్మహస్తం, దీపం కనెక్షన్ల గ్రౌండింగ్, తనిఖీల్లో ఎన్ని కేసులు పెట్టారు.. ఏమేం సీజ్ చేశారో అని స్పష్టంగా ఉండే ప్రొఫార్మా తయారు చేసి డెప్యూటీ తహశీల్దార్లు వివరాలను అందులో నమోదు చేయాలని డీఎస్వో వసంత్‌రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వసంత్‌రావు, ఏఎస్వో సత్యనారాయణ, డీఈవో రామారావు, ఎన్ఫోర్స్మెంట్ డెప్యూటీ తహశీల్దార్లు సత్యనారాయణ, నవీన్, సతీశ్, అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు పాల్గొన్నారు. -
వంద శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా?
హైదరాబాద్: గ్యాస్ రాయితీ, నగదు బదిలీ పథకం చట్టవిరుద్దమంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. గ్యాస్ రాయితీ, నగదు బదిలీపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 100 శాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా అని చమురు కంపెనీలను ధర్మాసనం ప్రశ్నించింది. అసంబద్ద విధానాల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. రాయితీ బదిలీ కోసం ఎంత మంది బ్యాంకు ఖాతాలు కలిగివుంటారని చమురు సంస్థలను ప్రశ్నించింది. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ పేట్ల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. నంబర్ పేట్ల కాంట్రాక్టును ఒక్కరికే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈవిధంగా స్పందించింది. -
నేటి నుంచి నగదు బదిలీ..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భారత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మొదట జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు పథకం వర్తించనుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. జిల్లాలో 4,36,429 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. 3,57,859 రెగ్యులర్ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. కాగా.. ప్రస్తుతం 2,12,279 మందికి ఈ పథకం వర్తించనుంది. నగదు బదిలీ పథకం అమలు కావాలంటే.. వినియోగదారుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు జిల్లాలో 60 శాతం మాత్రమే ఆధార్ నంబర్లను వారివారి బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేశారు. వీరికి మాత్రమే ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అందనుంది. దీంతో మిగతా 40 శాతం మంది వినియోగదారులు గ్యాస్ కనెక్షన్ కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో లబ్ధిదారుల బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు మాత్రం పథకం అమలు నాటి నుంచి ఒక నెల సమయం ఉంటుందని, ఆ సమయంలో అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుసంధానం చేసుకోకుంటే సబ్సిడీ రాదని, మార్కెట్ విలువ ప్రకారం గ్యాస్ రీఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. నేటి నుంచి అర్హత కలిగిన వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంది. నేడు ప్రారంభం.. ఈ నెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గం టలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగ దు బదిలీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నాం. - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌర సరఫరాల అధికారి గ్యాస్ కంపెనీ కనెక్షన్లు ఖాతాతో అనుసంధానం హెచ్‌పీసీఎల్ 1,24,040 71,764 బీపీసీఎల్ 86,940 52,416 ఐవోసీఎల్ 1,46,879 88,099 -------------------------------------- 3,57,859 2,12,279