కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ కు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ అనుసంధా నం ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌పీసీఎల్)లో మ్యాపింగ్ కానీ వివరాలు సేకరించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరికి ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్ అనుసంధానం చేయాలని, ప్రస్తుతం జిల్లాలో 92 శాతం అనుసంధానం పూర్తయిం దని తెలిపారు. జిల్లాలో 3,47,706 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 3,14,904 కనెక్షన్లు అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 28 వేలకుపైగా ఆయిల్ కంపెనీల డాటా బేస్‌లో సీడింగ్ చేయాల్సి ఉందన్నారు.
ఆధార్ అనుసంధానం కోసం బ్యాంకులకు వచ్చిన బండిల్స్ పూర్తి చేయాలని చెప్పారు. ఆయా ఏజెన్సీల పరిధిలో సీడింగ్ కానీ కనెక్షన్లు సీడింగ్ చేయాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెప్యూటీ తహశీల్దార్లను ఆదేశించారు. పనితీరు మెరుగుపడకుంటే తొలగించి కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించారు. ఈ నెల 28వ తేదీలోగా మ్యాపింగ్, సీడింగ్ పూర్తి చేసి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. జిల్లాలో 12,203 దీపం కనెక్షన్లు మంజూరు కాగా, 9,429 కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని, మిగతా 2,700 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెప్యూటీ తహశీల్దార్లు రేషన్‌కార్డుకు ఆధార్ సీడింగ్, అమ్మహస్తం, దీపం కనెక్షన్ల గ్రౌండింగ్, తనిఖీల్లో ఎన్ని కేసులు పెట్టారు.. ఏమేం సీజ్ చేశారో అని స్పష్టంగా ఉండే ప్రొఫార్మా తయారు చేసి డెప్యూటీ తహశీల్దార్లు వివరాలను అందులో నమోదు చేయాలని డీఎస్‌వో వసంత్‌రావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో వసంత్‌రావు, ఏఎస్‌వో సత్యనారాయణ, డీఈవో రామారావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెప్యూటీ తహశీల్దార్లు సత్యనారాయణ, నవీన్, సతీశ్, అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు పాల్గొన్నారు.
ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలి
Published Wed, Feb 26 2014 12:17 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement