స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు మంత్రులు అంగీకరించారు. రాజీనామాలను ఆమోదించనందున పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనాలన్న సీఎం కిరణ్ సూచనకు మంత్రులు అంగీకరించారు. జిల్లాల వారీగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్- గీతారెడ్డి, నిజామాబాద్- పి.సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్- డి. శ్రీధర్‌బాబు, రంగారెడ్డి- జి.ప్రసాద్‌కుమార్, మహబూబ్‌నగర్- డి.కె.అరుణ, నల్లగొండ- కె.జానారెడ్డి, వరంగల్- పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మం-రామిరెడ్డి వెంకటరెడ్డి, విజయనగరం-శత్రుచర్ల విజయరామరాజు, శ్రీకాకుళం -కొండ్రు మురళి, విశాఖపట్టణం-పి.బాలరాజు, తూర్పుగోదావరి -పి.విశ్వరూప్, పశ్చిమగోదావరి-వట్టి వసంతకుమార్, కృష్ణా -కె. పార్థసారథి, గుంటూరు -కన్నా లక్ష్మీనారాయణ, ప్రకాశం-ఎం.మహీధర్‌రెడ్డి, నెల్లూరు- ఆనం రామనారాయణరెడ్డి, వైఎస్‌ఆర్- అహ్మదుల్లా, కర్నూలు-టి.జి.వెంకటేశ్, అనంతపురం- ఎన్.రఘువీరారెడ్డి, చిత్తూరు-గల్లా అరుణకుమారి, ఆదిలాబాద్-బసవరాజు సారయ్య.
మంత్రి పదవికి రామచంద్రయ్య రాజీనామా
దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎంకు మంగళవారం రాజీనామా లేఖను పంపించారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
పతాకావిష్కరణకు మంత్రులు ఓకే
Published Wed, Aug 14 2013 2:52 AM | Last Updated on Sat, Jun 2 2018 4:00 PM
Advertisement