విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ (ఏపీపీఏసీ) చైర్మన్, ఎంపీ భూమా నాగిరెడ్డి విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్నారు. ఆయన సారథ్యంలో 12 మంది సభ్యులు జిల్లాలో భూ కేటాయింపులు జరిగిన రిషికొండ, తొట్లకొండ, భీమిలి, గంగవరం పోర్టు ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం ఏపీసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి... జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. గత 3,4 ఏళ్లకు సంబంధించి జరిగిన భూ కేటాయింపులపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు పీఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి తెలిపారు.