సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయానికి పెద్దపీట వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయం కలిపి లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలతో బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రణాళికేతర వ్యయం కిందే రూ. 80 వేల కోట్లు, రాష్ట్ర వార్షిక ప్రణాళికను రూ.30 వేల కోట్లకుపైగా ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు సోమవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక, ప్రణాళికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.