Special budget
-
ఏపీ బాలల బడ్జెట్ బహుబాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి. జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ–నీపా)) బుధవారం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్ బేస్డ్ ఫైనాన్సియల్ సపోర్టు సిస్టమ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేలా కృషి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు విద్యారంగంలో ముఖ్యంగా పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా వారిని మార్చేలా జగనన్న విద్యాకానుక కింద ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చుచేస్తూ 43 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయి. మనబడి నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింటింగ్‌లు, కాంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్ల నిర్మాణం వంటి ఏర్పాటు ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే వీలు ఏర్పడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో మెనూతో అందిస్తున్న భోజనం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు. ఇందుకు ఈ ఏడాది ప్రభుత్వం 1,595.55 కోట్లు ఖర్చుచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి తల్లి తన పిల్లలను ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరంగా ఉంచకుండా బడులకు పంపేలా ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి విని ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2022–23 విద్యాసంవత్సరంలోనే తల్లులకు రూ.6,500 కోట్లు అందించారు. చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ వినూత్న ఆలోచన ► చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు. ► కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణా న్ని సృష్టించడమే ఈ చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ లక్ష్యం. ► 2021–22లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు. ► బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ► వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు. -
పల్లెకూ పద్దు..
సాక్షి, అమరావతి: దేశ, రాష్ట్ర బడ్జెట్ల మాదిరిగానే రాష్ట్రంలో 13,029 గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)ల పేరుతో గ్రామ స్థాయి బడ్జెట్‌ను రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా మే 1 నుంచి జూన్ 15 వరకు గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. మన రాష్ట్రంలో 13,066 గ్రామ పంచాయతీలు (ఇటీవల కొత్తగా ఏర్పడిన వాటిని కలుపుకుంటే మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు) ఉండగా, 13,029 గ్రామ పంచాయతీల్లో జీపీడీపీలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 37 గ్రామ పంచాయతీలను ఇటీవల వాటి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఆయా చోట్ల జీపీడీపీ రూపకల్పన జరగలేదు. –కేంద్రం.. రాష్ట్రాలకు విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సగం మొత్తాన్ని జీపీడీపీల రూపకల్పన, అమలు ఆధారంగానే విడుదల చేస్తుంది. –ఏడాదిలో ఒక్కో గ్రామ పంచాయతీకి సొంత పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంత మొత్తంలో ప్రత్యేక నిధులు అందుతాయి.. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామ పరిధిలో ఎంత మేర నిధులు వచ్చే అవకాశం ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకొని, గ్రామానికి అందే మొత్తం నిధులతో ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేశాయి. –2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి గ్రామ పంచాయతీల వారీగా జీపీడీపీల రూపకల్పన కొనసాగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. ► 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రావడంతో కొత్త నిబంధనలతో కేంద్రం.. రాష్ట్రాల వారీగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించింది. ► రాష్ట్రాల వారీగా జరిగిన నిధుల కేటాయింపు, మారిన నిబంధనల మేరకు తిరిగి మరోసారి 2020–21కి రివైజ్డ్ జీపీడీపీలు ఖరారు చేశారు. ► 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి అందే నిధుల్లో అంచనాగా 50 శాతం మొత్తాన్ని గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి, భూగర్భజలం పెరగడానికి దోహదపడే కార్యక్రమాలకు కేటాయించారు. ► మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా ఏటా గ్రామ పంచాయతీల్లో వసతులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సర్వే నిర్వహిస్తుంది. దీని ద్వారా ఏ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయో గుర్తిస్తుంది. ► సర్వే ద్వారా ఆ గ్రామంలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. -
వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్: పోచారం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని వ్యవ సాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ‘తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సమా వేశానికి అచ్చంపేట, షాద్‌నగర్ శాసన సభ్యులు గువ్వల బాలరాజు, అంజయ్య, మార్క్‌ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి, ఎస్సీ కార్పొ రేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ప్రజాకవి గోరటి వెంకన్న, అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షులు కె.రాములు హాజర య్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఉద్యోగుల కోరికలను ఈ బడ్జెట్లో పొందుపరు స్తామన్నారు. ప్రజాకవి గోరటి వెంకన్న మాట్లాడుతూ దేశంలో అసమానతలతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నా రన్నారు. సమాజంలోని అక్రమాలపై ఆయన పాటలు పాడుతూ ఉద్యోగులను చైతన్యపరిచారు. వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు మాట్లాడుతూ తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పోచారాన్ని కోరారు. -
బడ్జెట్లో ‘భోజన’ కేటాయింపులు!
{పభుత్వ కార్యక్రమాల్లో భోజన ఖర్చుల కోసం.. ఇతరుల వద్ద చేయిచాచే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటల కసరత్తు ఎంత మొత్తం అనేది బడ్జెట్ వరకూ వేచి చూడాల్సిందే కరీంనగర్: శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు.. ఉత్సవాలు.. నిత్యం ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల కు హాజరయ్యే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల భోజన ఖర్చులకు ఇప్పటివరకు ప్రత్యేక బడ్జెట్ అంటూ ఏమీలేదు. ఇందుకోసం అయ్యే ఖర్చు బాధ్యతను రెవెన్యూ, ఇతర శాఖల అధికారులపై మోపుతుంటారు. సదరు అధికారులు తమ తమ శాఖల పరిధిలోని కాంట్రాక్టర్లకు ఆ ఖర్చు బాధ్యతనుఅప్పగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాల్లో వేసే టెంట్లు, కుర్చీలకు అయ్యే ఖర్చులను కూడా ఆయా కాంట్రాక్టర్లే భరిం చాల్సి వస్తోంది. దీనివల్ల కాంట్రాక్టర్లు చేపట్టే పనులు, బిల్లుల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం, తద్వారా పనుల్లో నాణ్యత తగ్గడం.. సరిగా పనులు చేయకపోవడం వంటివి నిత్యం కన్పిస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇకపై రాష్ట్ర బడ్జెట్లో భోజన ఖర్చులకు ప్రత్యేక నిధి కేటాయించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ అం శంపై కసరత్తు పూర్తిచేశారు. ఈనెల 14న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భోజన ఖర్చుల కోసం కొంత నిధిని ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిం చిన ఆర్థికశాఖ అధికారులు ఎంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించనున్నారని అడిగితే.. బడ్జెట్ ప్రసంగం వరకు వేచి చూడాలని చెబుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపు..? అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపు అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రస్తుతం కోటి రూపాయలున్న నియోజకవర్గ నిధులను రూ. 5 కోట్లకు పెంచాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనతోపాటు మంత్రులు జిల్లాల పర్యటన ల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపుపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
* కర్ణాటక తరహాలో రూపకల్పన: ఏపీ మంత్రివర్గం నిర్ణయం * పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, * డ్వాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత * ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’ పథకం ద్వారా పేదలు, ఉద్యోగులు, * పాత్రికేయులకు రూ. 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం * ఆదివాసీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన లేదు * ప్రభుత్వ ఆస్పత్రుల పటిష్టానికి సంఘాలు.. ఎమ్మెల్యే సూచించిన వ్యక్తి చైర్మన్ * అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. కర్ణాటక తరహాలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చెప్పారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌కు, టీడీపీ ప్రవేశపెట్టనున్న ప్రత్యేక బడ్జెట్‌కు తేడా ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. వ్యవసాయ శాఖ మంత్రి అధ్యయనం చేస్తున్నారని మాత్రమే సమాధానమిచ్చారు. ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’ పథకం ద్వారా పేదలు, ఉద్యోగులు, పాత్రికేయులకు గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివాసీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన లేదని చెప్పారు. స్థానికతపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం విజయనగరం జిల్లా బుడ్డిపేటకు చెందినదని, ఆయనే ఇప్పుడు స్థానికతకు ‘1956’ నిబంధన పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించినప్పుడు సంబరాలు చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. తెలంగాణకు ప్రత్యేక ఉన్నత విద్యామండలి ఏర్పాటు, వ్యవసాయ వర్సిటీ పేరు మార్పు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాల్లో వివాదాలు సృష్టించారన్నారు. మంత్రివర్గం తీసుకున్న మిగతా నిర్ణయాలు.. - పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, డ్వాక్రా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలన.. ఈ నాలుగు కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి - ప్రసిద్ధ ఆలయాలకు సందర్శకులను, ఆదాయాన్ని, ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి ‘టెంపుల్ టూరిజం’ అమలుకు ప్రాధాన్యత - ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయడానికి ప్రత్యేక చర్యలు. స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తిని చైర్మన్‌గా, ఆర్ఎంవో, ఆస్పత్రి సూపరింటెండెంట్, పాలన అధికారి సభ్యులుగా ‘ఆస్పత్రి అభివృద్ధి సంఘం’ ఏర్పాటు. ఆయా ఆసుపత్రుల్లో వసతుల కల్పన బాధ్యతలు అభివృద్ధి సంఘానికి - మాతా శిశు మరణాలను తగ్గించడానికి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాల కల్పన - ఆధార్ ఫీడింగ్ను నూరు శాతం పూర్తి చేయాలని నిర్ణయం - మంత్రులు సొంత జిల్లాలకే పరిమితం కాకూడదు. కేంద్రం నుంచి ఆయా శాఖలకు రావాల్సిన నిధులు సాధించడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు కలిసి వ్యూహరచన చేయాలి. విజయవంతంగా అమలు చేయడానికి పరస్పరం చర్చించుకోవాలి - నిరంతర విద్యుత్ సరఫరా(24ఁ7)కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా. ప్రస్తుతం రోజుకు 143 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 142 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోంది. హర్యానా నుంచి 200 మెగావాట్లు, నెల్లూరు జిల్లాలోని మీనాక్షి పవర్ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం జెన్కో వద్ద 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. అందువల్ల విద్యుత్ సరఫరాలకు ఇబ్బందులు ఉండవు - శాసనసభ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయం - విజయవాడలోని కంచి కామకోటి పీఠం వారి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ప్రభుత్వం ఇచ్చిన 532 చదరపు మీటర్ల స్థలం లీజును మరో 35 ఏళ్లుపొడిగింపు. లీజు రుసుం ఏడాదికి రూ. 6 వేలు పెంపు. 18 నుంచి బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.గవర్నర్ నరసింహన్ సోమవారం నోటిఫికే షన్ జారీ చేసినట్లు శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 20న బడ్జెట్ సమర్పించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబుఅధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు.సమావేశాలు సెప్టెంబర్ 13 వరకు జరగనున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్లోనిమండలిహాలులో మొదలవుతాయి.ఎజెండాపై శాసనసభా వ్యవహారాల మండలి (బీఏసీ)లో చర్చించి నిర్ణయిస్తారు. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొనాలి. సభ గౌరవాన్ని పెంపొందించే విధంగా వ్యహరించాలి’ అని పేర్కొన్నారు. -
ఏపీ బడ్జెట్ రూ. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయానికి పెద్దపీట వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయం కలిపి లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలతో బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రణాళికేతర వ్యయం కిందే రూ. 80 వేల కోట్లు, రాష్ట్ర వార్షిక ప్రణాళికను రూ.30 వేల కోట్లకుపైగా ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు సోమవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక, ప్రణాళికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. -
ఎదురు చూపుల కు 8 ఏళ్ల
మాచవరం, న్యూస్‌లైన్: పులిచింతల ముంపు గ్రామాల్లో నివశించే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేయాలి.. గ్రామం విడిచి వెళ్లే నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాట. చె ప్పిందే తడవుగా ప్యాకేజీల అమలుకు జీవో విడుదల చేశారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ విడుదలయింది. మహానేత మరణంతో పరిహారాలు, ప్యాకేజీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా నిర్వాసితులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. చూసి కళ్లు కాయలు కాసాయే తప్ప నష్టపరిహారం మాత్రం పూర్తి స్థాయిలో అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు.. హామీలతోనే సరి.. పులిచింతల ముంపు గ్రామాల జాబితాలో మాచవరం మండలంలోని రేగులగడ్డ, గోవిందాపురం, వెల్లంపల్లితో పాటు వేమవరం గ్రామంలోని కొంత భాగం ఉన్నాయి. వీరంతా 2006 నుంచి నష్ట పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మహానేత వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి కాగానే నిర్వాసితుల సౌకర్యాల కల్పనకు బడ్జెట్ కేటాయించారు. వెల్లంపల్లి, వేమవరం గ్రామాలకు పరిహారం అందగా రేగులగడ్డ, గోవిందాపురం వాసులకు కొంతమేర పరిహారం అందజేశారు. మహానేత మరణానంతరం ఇప్పటి వరకు వారికి పరిహారం దక్కలేదు. రేగులగడ్డ గ్రామంలో సుమారు 70 ఎకరాలు డీకే పొలాలకు నష్టపరిహారం రావాల్సి ఉంది. 1బీ రికార్డుల్లో, అడంగల్‌లో అనుభవదారుల పేర్లు ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం రాలేదు. ఈ పొలంలోనే సర్వే నిర్వహించి 38 ఎకరాలకు పరిహారం అందిస్తామని పులిచింతల డీటీ భాస్కరరావు, అప్పటి తహశీల్దార్ లెవి చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి గ్రామాలను సందర్శించారు. వారం రోజుల్లో ప్యాకేజీలను అందిస్తామని, ఇంటి స్థలాలు ఇస్తామని హామీలిచ్చి వెళ్లారు. వారి మాటలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. నిర్వాసితులు కోరుకున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. రేగులగడ్డ నిర్వాసితులు బ్రాహ్మణపల్లిలో కావాలని కోరుకున్నారు. అప్పటి ఎస్డీసీ సత్యభాస్కర్ అక్కడ స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణపల్లి రైతులు నిర్వాసితులకు ఇచ్చే పొలంపై కోర్టుకు వెళ్లడంతో అది కాస్తా వాయిదా పడింది. ఇప్పటికీ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందాపురం గ్రామస్తులకు కూడా నష్టపరిహారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కాని ఫలితం మాత్రం శూన్యం. కోరుకున్న చోట తమకు స్థలం కేటాయిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమో ఎక్కడ ఇస్తే అక్కడకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిందని నిర్వాసితులు వాపోతున్నారు. హౌసింగ్ గ్రాంట్, ఆర్ ఆర్ ప్యాకేజీలు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. నిర్వాసితులు మాత్రం అడిగిన చోటే స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. 480 పీసీపీ నంబర్లు ఉన్న వారికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్యాకేజీలు అందక ఇబ్బంది పడుతున్నారు. నల్గొండ జిల్లాలో నిర్వాసిత గ్రామాల్లోని వారికి ఇళ్లు ఇవ్వకుండానే ఆర్ ఆర్ ప్యాకేజీ అందజేశారు. గుంటూరు జిల్లాలో మాత్రం ఇంటి స్థలాలు, ఆర్ఆర్ ప్యాకేజీలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ అందించలేదు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.. ఏటి ఒడ్డునే ఉన్న మా గ్రామానికి నష్టపరిహారం అందక అవస్థలు పడుతున్నాం. అరకొర వచ్చిన పరిహారం డబ్బు కాస్తా ఖర్చయిపోయింది. ఒకేసారి పూర్తి నష్టపరిహారం అందించకుండా ఉన్న ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. తమ గ్రామంలోని నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. - నాగేంద్రం నాగేశ్వరరావు, సర్పంచ్, రేగులగడ్డ పరిహారం పూర్తిగా ఇస్తేనే వెళ్తాం.. మా గ్రామానికి ఆర్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలాలు, డీకే పొలాలకు నష్టపరిహారం రాలేదు. ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మాకు ప్యాకేజీలు రాలేదు. ఇప్పుడు అధికారులేమో గ్రామం విడిచి వెళ్లిపోండి, నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తమకు పూర్తి నష్టపరిహారం ఇస్తేనే గ్రామం విడిచి వెళతాం. - సింగడాల ముక్కంటి, మాజీ ఎంపీటీసీ, రేగులగడ్డ