బడ్జెట్‌లో ‘భోజన’ కేటాయింపులు! | Budget 'dining' Provisions! | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ‘భోజన’ కేటాయింపులు!

Published Fri, Mar 11 2016 1:28 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

బడ్జెట్‌లో ‘భోజన’ కేటాయింపులు! - Sakshi

బడ్జెట్‌లో ‘భోజన’ కేటాయింపులు!

{పభుత్వ కార్యక్రమాల్లో భోజన ఖర్చుల కోసం..
ఇతరుల వద్ద చేయిచాచే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఈటల కసరత్తు
ఎంత మొత్తం అనేది బడ్జెట్ వరకూ వేచి చూడాల్సిందే

 
కరీంనగర్: శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు.. ఉత్సవాలు.. నిత్యం ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల కు హాజరయ్యే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల భోజన ఖర్చులకు ఇప్పటివరకు ప్రత్యేక బడ్జెట్ అంటూ ఏమీలేదు. ఇందుకోసం అయ్యే ఖర్చు బాధ్యతను రెవెన్యూ, ఇతర శాఖల అధికారులపై మోపుతుంటారు. సదరు అధికారులు తమ తమ శాఖల పరిధిలోని కాంట్రాక్టర్లకు ఆ ఖర్చు బాధ్యతనుఅప్పగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాల్లో వేసే టెంట్లు, కుర్చీలకు అయ్యే ఖర్చులను కూడా ఆయా కాంట్రాక్టర్లే భరిం చాల్సి వస్తోంది. దీనివల్ల కాంట్రాక్టర్లు చేపట్టే పనులు, బిల్లుల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం, తద్వారా పనుల్లో నాణ్యత తగ్గడం.. సరిగా పనులు చేయకపోవడం వంటివి నిత్యం కన్పిస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇకపై రాష్ట్ర బడ్జెట్‌లో భోజన ఖర్చులకు ప్రత్యేక నిధి కేటాయించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర కు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ అం శంపై కసరత్తు పూర్తిచేశారు. ఈనెల 14న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భోజన ఖర్చుల కోసం కొంత నిధిని ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిం చిన ఆర్థికశాఖ అధికారులు ఎంత మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించనున్నారని అడిగితే.. బడ్జెట్ ప్రసంగం వరకు వేచి చూడాలని చెబుతున్నారు.
 
 
అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపు..?
 అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపు అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రస్తుతం కోటి రూపాయలున్న నియోజకవర్గ నిధులను రూ. 5 కోట్లకు పెంచాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనతోపాటు మంత్రులు జిల్లాల పర్యటన ల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ నియోజకవర్గ నిధుల పెంపుపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement