హైదరాబాద్/చెన్నై: రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో శనివారం ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాయలసీమ,కొన్ని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారి నరసింహారావు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రవేశించాయని, దీంతో వచ్చే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్య రుతుపవనాల రాక
Published Sun, Oct 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement
Advertisement