జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టరు శ్రీనివాసరావు తెలిపారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు
బొబ్బిలి, న్యూస్‌లైన్:
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టరు శ్రీనివాసరావు తెలిపారు. బొబ్బిలి లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ఏడేళ్ల పాటు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను ఆన్‌లైన్ లో పొందుపరచడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపా రు. దేశంలోని 10 జిల్లాలను అంగ న్‌వాడీల పటిష్టత, పౌష్టికాహారం పథకం కింద ఎంపిక చేస్తే అందులో..రాష్ట్రంలో ఒక్క విజయనగరం జిల్లానే ఎంపిక చేశారని పేర్కొన్నారు.
పట్టణాల్లోని కేంద్రాలకు నిబంధనల మేర అద్దెలు పెంచామన్నారు. అన్ని కేంద్రాలకూ రెండు నెలల్లో గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నారు. జిల్లాలో 48 కార్యకర్తలు, 64 ఆయాలు, 147 మినీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి రెండు వారాల్లో నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పారు. కార్యకర్తలు, ఆయాలకు బదిలీలు ఉండవని స్పష్టం చేశారు. జనవరి ఒకటి నుంచి సాలూరు రూరల్, నెల్లిమర్ల, ఎస్.కోట మండలాల్లో ఇందిరమ్మ అమృతహస్తం కింద సంపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 250 భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో పీఓ సుశీల ఉన్నారు.


