అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం కడప నగరంలో ఖాళీ అన్నం గిన్నెలను తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి పాతబస్టాండు, ఏడురోడ్ల కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజకుళాయమ్మ, శంకరమ్మ మాట్లాడుతూ కనీస వేతనంగా రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అర్బన్ విభాగం అధ్యక్షురాలు అంజనీదేవి, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, రూరల్ నాయకులు కృష్ణవేణి, పద్మావతి, సావిత్రి పాల్గొన్నారు.
- న్యూస్‌లైన్ , కడప కలెక్టరేట్
అంగన్ వాడీల వినూత్న నిరసన
Published Wed, Feb 19 2014 2:53 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Advertisement