మూడు రోజుల్లో ప్రకటన: చంద్రబాబు | Announcement in Three days: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ప్రకటన: చంద్రబాబు

Published Wed, Jul 9 2014 6:22 PM | Last Updated on Sat, Jul 28 2018 3:46 PM

రఘురామ్ గోవింద రాజన్ - చంద్రబాబు నాయుడు - Sakshi

రఘురామ్ గోవింద రాజన్ - చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బిఐ గవర్నర్  రఘురామ్ గోవింద రాజన్ అంగీకరించారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. ఎన్నికల ముందు రైతులు, చేనేత కార్మికుల రుణాలు, డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం అదేనని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణలు చేయడం సాధ్యం కాదని రుణమాఫీ కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు.

ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా  చంద్రబాబు హామీలు ఇచ్చారు. రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులేదు.  రిజర్వు బ్యాంకు అంగీకరించలేదు.  పాత రుణాలు చెల్లిస్తేగానీ, కొత్త రుణాలు  ఇవ్వం అని బ్యాంకులు తెగేసి చెప్పాయి. దాంతో రుణాలు మాఫీ కాస్త రుణాల రీషెడ్యూల్‌కు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుండా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం కల్పిస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి, చెల్లింపునకు గడువు మాత్రమే పొడిగిస్తారు.

రుణాల రీషెడ్యూల్‌కు రైతులు అంగీకరించడంలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలను మాఫీ చేయమని రైతులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం తన ప్రయత్నాలు తను చేసింది.  రుణాలను రీషెడ్యూల్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, బ్యాంకులను, రిజర్వు బ్యాంకును కోరింది. రుణాల రీషెడ్యూల్కు కూడా బ్యాంకులు అంగీకరించలేదు. రిజర్వు బ్యాంకు చెబినేతే రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకులు స్పష్టం చేశాయి.

ఈ నేపధ్యంలో రుణాలు మాఫీ సాధ్యం కాదు గనుక, కనీసం రీషెడ్యూల్ చేయించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆర్బిఐ గవర్నర్  రఘురామ్ గోవింద రాజన్ ను ఒప్పించారు. రుణాల మాఫీ అవుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర నిరాశకు గురవుతారు. కొంతమంది రైతుల జీవితాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఎన్నికలలో హామీలు ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఎందురవుతోయో చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement