reshedule
-
వందే భారత్ రీషెడ్యూల్.. నాలుగు గంటల ఆలస్యం!
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వందే భారత్’ రైలు సుమారు నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరనుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే ట్రైన్ సుమారు 4.15 గంటలకు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకోనుంది.Train RescheduleTrain No.20833 Visakhapatnam - Secunderabad Vande Bharat express is rescheduled to leave at *10:00 hrs* on 23.06.2024 instead of its scheduled departure at 05:45 hrs. (Rescheduled by 4 hrs 15 Minutes) @RailMinIndia@EastCoastRail@SCRailwayIndia @drmvijayawada pic.twitter.com/fJjRmKUV5z— DRMWALTAIR (@DRMWaltairECoR) June 21, 2024 అయితే రేపు ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్‌ను ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రీషెడ్యూల్ కారణంగా ఆలస్యం జరగనున్నట్లు సమాచారం. దీంతో ట్రైన్ ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ‘ఎక్స్’లో వైరల్‌గా మారింది. -
గ్రూప్-2 అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట
-
TSPSC: పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్TSPSC. ఈ మేరకు ఐదు నిమాయక పరీక్షలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మే 15, 16వ తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నాన్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 20వ తేదీకి రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్
న్యూఢిల్లీ: రీషెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. శనివారం ఆన్లైన్లో నిర్వహించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ అమల్లోకి వచ్చాకే విశ్వ క్రీడలు నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలతో నెలకొన్న సందిగ్ధతను ఆయన సమావేశంలో దూరం చేశారు. ‘టోక్యో క్రీడలపై రోజుకో రకంగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఏది ఏమైనా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయి. విశ్వ క్రీడలకు సంబంధించిన ముఖ్య వ్యక్తులతో నేను తరచుగా మాట్లాడుతున్నా. వదంతులకు ప్రాధాన్యతనివ్వకండి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో కరోనా చికిత్స భారత్‌లో అందుబాటులోకి రావొచ్చు. కాబట్టి ఒలింపిక్స్ జరుగుతాయనే మానసిక సన్నద్ధతతో ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు. -
రీషెడ్యూల్ చేయండి..సాధ్యం కాదు..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేయాలంటూ తాము చేసిన విజ్ఞప్తిపై ఎస్ఈసీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు పేర్కొన్నారు. తాము ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోకపోగా ఎస్ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోపిశెట్టి నిరంజన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అఖిలపక్ష సమావేశంలో ఆయన ఉపయోగించిన పరుష పదజాలానికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజరేషన్లు ప్రకటించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరితే తనపై దాడి చేశారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్ ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు ఎన్నికల తేదీలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సమావేశం ఒకింత రసాభాసగా మారింది. తమతో పరుషంగా మాట్లాడిన కృష్ణ స్వరూప్‌ను పోలీసుల సహాయంతో బయటకు పంపించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. శనివారం ఎస్ఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలు, రాజకీయపక్షాలతో కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వి.నాగిరెడ్డి ముందుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, షెడ్యూల్ విడుదల గురించి వివరించారు. మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు నిర్వహించొచ్చని మున్సిపల్ చట్టంలో ఉందని, ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో తామే కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మెజారిటీ మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసి 7 నెలలు గడిచినందున, సమ్మక్క,సారక్క జాతర ను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 25లోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నాగిరెడ్డి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటుంటే తనను విమర్శిస్తున్నారని, కొందరు చెత్త, చెత్తగా మాట్లాడుతున్నారని, తన వద్ద పోలీసులు లేరని, ఉంటే వారిని పోలీస్‌స్టేషన్‌కు పంపేవాడినంటూ వ్యాఖ్యానించారు. కమిషనర్ హోదాలో ఉండి అలా వ్యాఖ్యానించడం ఆయన ఔన్నత్యానికి సరికాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని, సాయంత్రం 6 తర్వాత ప్రచారానికి అనుమతించేలా నిబంధనలు సడలించాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి జనగామ మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత డీజీ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎన్నికలు వాయిదా వేయించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని టీఆర్ఎస్ ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికలను అనుకున్న తేదీల్లో నిర్వహించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ కోరారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు లేకుండా షెడ్యూల్ విడుదల చేయడం సరికాదని బీజేపీ నేత జి.మనోహర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. వాయిదా వేయలేం... ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సి పల్ ఎన్నికలుంటాయని, వాటిని వాయిదా వేయలేమని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 30 నాటికి ఓటర్ల జాబితా వెలువడుతుందని, వచ్చే నెల 6వ తేదీకల్లా రిజర్వేషన్లు ఇస్తే 7న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే నోటిఫికేషన్ జారీ చేయలేమని తెలిపారు. కార్యక్రమంలో విశ్వేశ్వరరావు (టీజేఎస్), బాలమల్లేశ్ (సీపీఐ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), నాగరాజు (తెలంగాణ లోక్‌సత్తా) ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది.. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారీతిన, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఇష్ట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిందని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామని, అధికార పార్టీకి వత్తాసు పలికేలా నాగిరెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని నిరంజన్ విమర్శించారు. -
ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు రీషెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం: ఇంటర్మీడియట్ విద్యార్థులు జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. తాజాగా ఇంటర్ ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని వీరికి ముందుగా నిర్ణయించిన సంక్రాంతి సెలవులను కూడా మార్పు చేసింది. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు మార్పు చేసింది. ఇప్పుడు ఈనెల 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 26న గణతంత్ర దినోత్సవం, 27న ఎథిక్స్ పరీక్ష, 28న ఆదివారం, 29న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉన్నందున ఆయా రోజుల్లో ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించరాదని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మూడు రోజుల్లో ప్రకటన: చంద్రబాబు
-
మూడు రోజుల్లో ప్రకటన: చంద్రబాబు
హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ గోవింద రాజన్ అంగీకరించారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. ఎన్నికల ముందు రైతులు, చేనేత కార్మికుల రుణాలు, డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం అదేనని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణలు చేయడం సాధ్యం కాదని రుణమాఫీ కమిటీని నియమిస్తూ తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా చంద్రబాబు హామీలు ఇచ్చారు. రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులేదు. రిజర్వు బ్యాంకు అంగీకరించలేదు. పాత రుణాలు చెల్లిస్తేగానీ, కొత్త రుణాలు ఇవ్వం అని బ్యాంకులు తెగేసి చెప్పాయి. దాంతో రుణాలు మాఫీ కాస్త రుణాల రీషెడ్యూల్కు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుండా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం కల్పిస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి, చెల్లింపునకు గడువు మాత్రమే పొడిగిస్తారు. రుణాల రీషెడ్యూల్కు రైతులు అంగీకరించడంలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలను మాఫీ చేయమని రైతులు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం తన ప్రయత్నాలు తను చేసింది. రుణాలను రీషెడ్యూల్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, బ్యాంకులను, రిజర్వు బ్యాంకును కోరింది. రుణాల రీషెడ్యూల్కు కూడా బ్యాంకులు అంగీకరించలేదు. రిజర్వు బ్యాంకు చెబినేతే రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో రుణాలు మాఫీ సాధ్యం కాదు గనుక, కనీసం రీషెడ్యూల్ చేయించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ గోవింద రాజన్ ను ఒప్పించారు. రుణాల మాఫీ అవుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర నిరాశకు గురవుతారు. కొంతమంది రైతుల జీవితాలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఎన్నికలలో హామీలు ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఎందురవుతోయో చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది. -
మాఫీ కాదు..రీషెడ్యూలే!
వ్యవసాయ రుణాలపై చంద్రబాబు తరుణోపాయం ఏపీలో రుణ మాఫీపై అడుగు ముందుకు పడని వైనం కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికకు గడువు పూర్తి సీఎం చంద్రబాబుతో కమిటీ సభ్యుల సమావేశం ఎంత మేర రుణ భారం భరిస్తారో చెప్పాలన్న కమిటీ దానిపై ఆర్బీఐతో మాట్లాడాలని కమిటీకి బాబు సూచన ఇప్పటికి మాఫీ గండం గట్టెక్కటానికి ‘రీషెడ్యూల్’ మంత్రం సాక్షి, హైదరాబాద్: రైతులు తీసుకున్న అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, తొలి సంతకం దానిపైనే అంటూ తొలి సంతకం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు వీలైనంత మేర రుణ మాఫీ అంశంపై కాలయాపన చేసే ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పుడు రుణ మాఫీ కాదు.. రైతుల రుణాల రీషెడ్యూల్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రుణ మాఫీ విధివిధానాలు రూపొందించడంపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ముందుగా నిర్ణయించిన గడువు మేరకు ఆదివారం తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కమిటీ చైర్మన్ సహా ఇతర సభ్యులు ఆదివారం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కానీ ఎలాంటి నివేదికనూ సమర్పించలేదు. అయితే.. ప్రభుత్వం ఎంత మేర రుణ భారాన్ని భరిస్తుందో తెలియజేస్తే అందుకు అనుగుణంగా విధివిధానాలను రూపొందిస్తామని కోటయ్య కమిటీ సీఎం చంద్రబాబుతో పేర్కొన్నట్లు తెలిసింది. పభుత్వం ఎంత మేర రుణ భారాన్ని భరిస్తుందనేది చంద్రబాబు చెప్పలేదని.. ఆ విషయాన్ని కూడా ఆర్బీఐతో చర్చించిన తరువాతనే చెప్పగలమని, ఆర్బీఐతోనూ కోటయ్య కమిటీయే చర్చించి ఎంత మేర రుణ భారం భరించవచ్చో అంచనాకు రావాలని సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో.. ఎంత మేర రుణ భారం భరించగలదో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాతనే విధివిధానాలను రూపొందించాలని కోటయ్య కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రాథమిక నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వం మరో 10 రోజుల అదనపు గడువును కూడా కమిటీకి ఇచ్చింది. ప్రాథమిక నివేదికకే 10 రోజులు ఆలస్యమైతే.. ఆ తర్వాత ఇవ్వాల్సిన తుది నివేదికకు మరింత ఆలస్యమవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నివేదిక వచ్చి రుణ మాఫీ అమలయ్యేసరికి ఖరీఫ్ సీజన్ కాస్తా ముగిసిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రీషెడ్యూల్కు ఆర్బీఐని ఒప్పించే యోచన... మరోవైపు.. ఇప్పటికిప్పుడు రుణ మాఫీ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కొత్త రుణాలు ఇప్పించడం ఎలాగ అనే అంశంపై దృష్టి సారించింది. ఇందుకు గత ఆర్థిక సంవత్సరంలో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయించి కొత్త రుణాలు మంజూరు చేయించాలని స్థూలంగా నిర్ణయించారు. గత ఖరీఫ్‌లో కరువు కారణంగా, తుపాను కారణంగా 575 మండలాల్లో రైతులు పంటలను నష్టపోయారు. అయితే అప్పటి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేసింది. కరువు సంభవించిన 90 రోజుల్లో ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తేనే రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ నిబంధనలు అంగీకరిస్తాయి. కరువు మండలాలను ప్రకటించడంలో అప్పటి ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇప్పటి వరకు ఆ మండలాల్లోని రైతుల రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అనుమతించలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకువెళి,్ల నిబంధనలు సడలింపచేసి రుణాలను రీషెడ్యూల్ చేయించడం ద్వారా ఇప్పటికిప్పుడు రుణ మాఫీ గండం నుంచి గట్టెక్కాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయిస్తే, తక్షణం తదుపరి రుణాలు లభిస్తాయి కనుక రైతులకు ఇబ్బంది ఉండదనేది సర్కారు అభిప్రాయంగా చెప్తున్నారు. నగదు చెల్లిస్తేనే రుణ మాఫీ అన్న ఆర్బీఐ: వ్యవసాయ రుణ మాఫీకి సహకరించాలని చంద్రబాబు ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాలేదు. దీనిపట్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే చంద్రబాబు లేఖ రాయడానికి ముందే ఆర్బీఐ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రుణ మాఫీపై లేఖలు రాసిన విషయం తెలిసిందే. రుణ మాఫీ చేయాలంటే, రైతులు చెల్లించాల్సిన రుణాల మొత్తాన్ని నగదు రూపంలో ఆయా ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లించాల్సిందేనని ఆ లేఖలో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. ఆర్బీఐ అంగీకరిస్తేనే రీషెడ్యూల్: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఇప్పటి వరకు రైతులు తీసుకున్న రుణాలు ఎంత మేర బకాయిలున్నాయనే వివరాలన్నీ కోటయ్య కమిటీ సేకరించింది. అందులో సన్న, చిన్నకారు రైతులు ఎంత మంది, వారి పేరున ఉన్న రుణాలెన్ని, బంగారాన్ని కుదవపెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలెన్ని, అందులో మహిళల పేరు మీద ఉన్న రుణాలెన్ని? అనే వివరాలను కోటయ్య కమిటీ పూర్తి స్థాయిలో సేకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర రైతుల పేరు మీద ఉన్న రుణాలను బ్యాంకులకు చెల్లిస్తుందో చెప్తే.. ఏ రైతుకు ఎంత మేర రుణాలు మాఫీ చేయాలనే విధివిధానాలను రూపొందించగలమని కోటయ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు కోటయ్య కమిటీ చేసిన కసరత్తు వల్ల రుణ మాఫీ అంశం ఎటూ తేలకుండా అయింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల తరువాతనే రుణ మాఫీ ఎంతవరకు చేయగలమనే నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీఐ అంగీకరిస్తే రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేస్తారు. లేదంటే అంతే సంగతులు.