
సాక్షి, హైదరాబాద్: కొలువుల భర్తీ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్TSPSC. ఈ మేరకు ఐదు నిమాయక పరీక్షలకు శనివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నెల 23వ తేదీన జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఈ నెల 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్షను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మే 15, 16వ తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ నాన్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 20వ తేదీకి రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment