
కదలిక!
రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాల ప్రజలకు ఊరట కలిగించేందుకు ఎన్నో వరాలు ఇచ్చింది. గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఇదే జరిగితే జిల్లాలోని పత్తి రైతులకు లబ్ధి చేకూరటంతోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.
యడ్లపాడు
మండలంలోని వంకాయలపాడు రెవెన్యూ పరిధి బోయపాలెంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 126 ఎకరాల భూమిని కేటాయించింది. పార్క్ పనులకు 2010 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య శంకుస్థాపన చేశారు. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పార్క్ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు తాజా ప్రకటన మేరకు పార్కు పనులు వేగవంతం కానున్నారుు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి..
పార్కు ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన (ఏపీఐఐసీ) సంస్థ ముందుకు వచ్చింది. పార్క్‌కు 148 ఎకరాలు అవసరమని గుర్తించగా తొలిదశలో 126 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించారు. 22 ఎకరాలు కోర్టు వివాదంలో ఉండగా మిగిలిన 108 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. ఎకరాకు రూ.2 లక్షల నామమాత్రపు ధరకే భూములను ఇచ్చింది. పార్కు నిర్మాణం కోసం సంస్థ ప్రాంతీయ అధికారులు ప్రతిపాదించిన ప్రణాళికలను అప్పటి ఎండీ తిరస్కరించారు. తర్వాత కొత్త ప్రణాళికలను రూపొందించలేదు. పార్కు భూములకు సరిహద్దు రాళ్లు వేయడం మినహా ఇంకే అభివృద్ధి పనులు చేపట్టలేదు. పార్కులో వీవింగ్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ముందుకొచ్చినా వారికి భూములను కేటాయించలేదు.
పారిశ్రామిక హబ్‌గా బోయపాలెం
గుంటూరు జిల్లా పత్తి పంట సాగుకు ప్రసిద్ధి. ఏటా 1.80 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో జిన్నింగ్ మిల్లులు, 80కి పైగా స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యూయి. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించవచ్చు. వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. తద్వారా జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. బోయపాలెం పరిధిలో స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో ప్రకటించారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటైతే జిన్నింగ్, స్పిన్నింగ్ యూనిట్లతోపాటు వీవింగ్, డరుుంగ్, నిట్టింగ్ పరిశ్రమలు వస్తారుు. దీంతో బోయపాలెం పారిశ్రామిక హబ్‌గా ఎదుగుతుంది. ఫలితంగా పత్తి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వస్త్ర ఎగుమతుల ద్వారా విదేశీమారక ద్రవ్యం సమకూరుతుంది.
పరిశ్రమలకు ఎన్నెన్నో రాయితీలు..
పార్కులో నెలకొల్పే వస్త్ర పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తాయి. సమీకృత జౌళి పార్కుల పథకం (స్కీం ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్-ఎస్‌ఐటీపీ) ఔత్సాహికులకు వరం. ఈ పథకం కింద జౌళి పరిశ్రమల శాఖ నుంచి గరిష్టంగా రూ.40 కోట్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. ఎస్‌ఐటీపీలో యూనిట్లు పెట్టేవారికి టఫ్స్(టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్) కింద భారీ రాయితీలు లభిస్తాయి. పవర్, వ్యాట్ ట్యాక్స్ నుంచి మినహాయింపులు లభిస్తాయి.
రూ..600 కోట్ల పెట్టుబడులు రావచ్చు..
టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటైతే రూ.600 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పె ర గవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేకూరుతుంది. అన్ని విభాగాలకు చెందిన పరిశ్రమలు ఒకేచోట ఏర్పాటవటం వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుంది.
- దాసరి చంద్రశేఖర్‌రావు,
ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోషియేషన్ మాజీ కార్యదర్శి