ఓఎన్‌జీసీ బావి వద్ద లీకవుతున్న గ్యాస్
Published Wed, Jul 2 2014 5:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
తూర్పుపాలెం: నగరం దుర్ఘటన మరిచిపోకముందే ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీకవుతున్న సంఘటన స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా మల్కిపురం మండలం తూర్పుపాలెంలో చోటు చేసుకుంది.
తూర్పుపాలెం గ్రామానికి కిలో మీటర్ దూరంలోనే ఓ కొబ్బరితోటలో గ్యాస్ లీకవుతున్నట్టు సమాచారం. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తూర్పుపాలెం జీసీఎస్కు వెళ్లే పైప్‌లైన్ వద్ద లీక్ అవుతున్నట్టు తెలిసింది.
తూర్పుగోదావరి జిల్లాలోని నగరం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలిన దుర్ఘటనలో 20 మందికి పైగా మరణించగా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
Advertisement
Advertisement