బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
నేటి నుంచి ఉత్తర తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారామ్ ‘సాక్షి’కి తెలిపారు. ఐదు రోజులపాటు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని వివరించారు.
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.