విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల బది లీల్లో భాగంగా చేపడుతున్న పాఠశాల, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్ర క్రియ ప్రహసనంగా మారింది. షెడ్యూల్ ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల 8వ తేదీతో ముగించి ఖాళీలు, మిగులు పోస్టుల జాబితాను 9వ తేదీన ప్రకటించాల్సి ఉంది. రాత్రంతా కసరత్తు చేసినా జాబితా కొలిక్కిరాలేదు. రేషనలైజేషన్
జీఓలను ఇటీవల మూడుసార్లు సవరించడంతో ఆ మేరకు మూడు జాబితాలను జిల్లా స్థాయిలో తయారు చేశారు. ఆగస్టు 31న తేదీ నాటికి విద్యార్థుల నమోదు సంఖ్యను ప్రాతిపధికగా తీసుకొని ఒక జాబితా, ఇదే తేదీలోపు విద్యార్థి ఆధార్ నమోదు సంఖ్యను తీసుకొని మరొకజాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి చైల్డ్ ఇన్ఫో నమోదు ఆధారంగా మూడో జాబితాను జిల్లా విద్యాశాఖ తయారుచేసింది. ఈ మూడు జాబితాలను తయారు చేయడానికి జిల్లా విద్యాశాఖకు దాదాపుగా 15 రోజులు పట్టింది. అయితే తాజాగా బుధవారం రాత్రి 9.30 తరువాత నంబర్ 55తో మరో సవరణ జీఓను విడుదల చేయడంతో ఖాళీలు, మిగులు పోస్టుల సంఖ్య జాబితా తయారీ ప్రక్రియ మొదటికి వచ్చింది.
ముందుగా తయారుచేసిన మూడు జాబితాలకు సంబంధం లేకుండా 2015 ఏప్రిల్ 30నాటికి విద్యార్థుల ఆధార్‌నమోదు సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని ఉపాధ్యాయ పోస్టులను లెక్కించాలని సవరణ జీఓలో పేర్కొన్నారు. మరో మూడు అంశాలను పేర్కొని వాటిని పరిగణలోకి తీసుకొని కొత్త జాబితాను శుక్రవారం ఉదయానికే విడుదల చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాబితా తయారీలో బుధవారం రాత్రంతా సిబ్బంది తలమునకలయ్యారు. అయితే గురువారం సాయంత్రం 5.00 గంటలలోపు తయారు చేయలేకపోయారు. సవరించిన నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని జాబితా తయారు చేయడానికి కనీసం నాలుగు రోజులైన పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.
ఇంతటి ప్రక్రియను హడావుడిగా చేపడితే భారీ స్థాయిలో తప్పులు దొర్లి ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బదిలీ షెడ్యూల్ యథావిథిగా కొనసాగుతోంది. బదిలీ దరఖాస్తులను పెట్టుకోవడానికి వెబ్‌సైట్ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకొనే అవకాశం ఇచ్చారు. అయితే జిల్లాలో పోస్టుల ఖాళీలు, మిగులు పోస్టులు వివరాలు తెలియక పోవడం వల్ల తొలి రోజున దరఖాస్తులు చేయడానికి ఉపాధ్యాయులు ముందుకురాలేదని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో 8 సంవత్సరాల సర్వీసున్న ఉపాధ్యాయులు, బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులు సుమారు ఆరు వేల మంది వరకు ఉన్నారు. బదిలీ ప్రక్రియ సక్రమంగా లేకపోవడం వల్ల వీరంతా ఆందోళనలో ఉన్నారు.
సవరణ జీఓ ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!
వెబ్‌సైట్‌లో బదిలీ దరఖాస్తుల స్వీకరణ ముందు ఉపాధ్యాయుల ఐడీ, ఆధార్‌నంబర్లను, పుట్టిన తేదీ, మొదటి నియామకపు తేదీ, ప్రస్తుత పాఠశాలలో నియామకపు తేదీ, పనితీరు పాయింట్లు, ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. స్కూళ్లలోని ఎలిమెంటరీ సెక్షన్లకు గాని, ఉన్నత పాఠశాలలకు గాని రేషనలైజేషన్ లేనందువల్ల ఫిజికల్ ైసైన్స్ నుంచి గణితారి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు మార్పులు ప్రస్తుత బదిలీల్లో లేవు. కావున వాటికి కేటాయించిన ఐదు పాయింట్లను రద్దుచేశారు.
రేషనలైజేషన్‌పై మరో జీవో
Published Thu, Sep 10 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM
Advertisement
Advertisement