నోటీసుల పేరుతో మరో నాటకం | Another play with the name of the notices | Sakshi
Sakshi News home page

నోటీసుల పేరుతో మరో నాటకం

Published Tue, Sep 5 2017 1:24 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Another play with the name of the notices

సాక్షి, అమరావతి: ప్రాజెక్టు పనుల్లో డొల్లతనాన్ని మసూద్‌ హుస్సేన్‌ కమిటీ బహిర్గతం చేస్తూ నివేదిక ఇవ్వడం.. కేంద్రం చర్యలకు ఉపక్రమించడంతో.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో  కొత్త నాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేయాలని తొలి నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ప్రతిపాదిస్తూ వస్తున్నా పట్టించుకోకపోగా.. ఆ సంస్థకు వంతపాడుతూ వచ్చిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు చర్యలకు ఉపక్రమించినట్లు నటిస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్‌కు 60సీ కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా కొన్ని పనులు తొలగించి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలని భావిస్తోంది.

తాజాగా కేంద్రం  ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి 60సీ కింద నోటీసులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి వివరణ వచ్చాక.. అది సంతృప్తికరం గా లేకపోతే, అప్పుడు చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న వెంటనే.. వాటిని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేలా ట్రాన్స్‌ట్రా య్‌తో కలసి ప్రణాళిక రచించారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. తద్వారా  చర్యలు తీసుకున్నామని కేంద్రాన్ని మభ్యపెట్టాలన్నది ఎత్తుగడగా తెలుస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్‌ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కావడంతో సీఎం చంద్రబాబు దాన్ని ముందునుంచీ వెనుకేసుకు వస్తున్న సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement