
దగ్గబాటి పురందేశ్వరి (ఫైల్ ఫోటో)
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే తమ తల్లికి తామే అన్యాయం చేసినట్లు అవుతుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చా కన్వీనర్ దగ్గబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో తమ పార్టీ వివక్ష చూపటంలేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలకు బీజేపీ సానుకూలంగా ఉందని తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగితే తాము ఎందుకు చూస్తూ ఊరుకుంటామని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిని నమ్మవద్దని పురందేశ్వరి ప్రజలకు సూచించారు.
,
Comments
Please login to add a commentAdd a comment