ఆ కార్మికులకు ప్యాకేజీ కోసం చర్చించండి | AP Agricultural workers requests ys jagan mohan reddy to demand for package | Sakshi
Sakshi News home page

ఆ కార్మికులకు ప్యాకేజీ కోసం చర్చించండి

Published Thu, Dec 18 2014 1:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆ కార్మికులకు ప్యాకేజీ కోసం చర్చించండి - Sakshi

ఆ కార్మికులకు ప్యాకేజీ కోసం చర్చించండి

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు వ్యవసాయ కార్మిక సంఘం నేతల వినతి
 సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో సర్వం కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిం చేలా అసెంబ్లీలో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, కార్యదర్శి టి.క్రాంతికిరణ్ బుధవారం జగన్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి వ్యవసాయ కార్మికుల, దళితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
 
 రాజధాని ప్రాంతంలో లక్ష మంది దళితులు, వ్యవసాయకార్మికులు సర్వం కోల్పోతారని.. అయినా ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ ఒక నిర్దిష్టమైన ప్యాకేజీని ప్రకటించలేదని జగన్ దృష్టికి తెచ్చారు.  కాగా, ఉపాధి హామీ పథకాన్ని కొన్ని మండలాలకే పరిమితం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి తీర్మానం చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ సందర్భంగా జగన్‌కు విజ్ఞప్తి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement