సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినేట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు రూ. 3216.11 కోట్ల టెండర్ రద్దు.. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ.. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.. మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment