సాక్షి, అమరావతి: ‘వైఎస్‌ఆర్ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు గాను కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో..
- ‘జగనన్న విద్యా దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు.
- టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానే కేబినెట్‌లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లులో సవరణలు చేయనున్నారు.
- పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది.
- వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
Published Wed, Nov 27 2019 4:19 AM | Last Updated on Wed, Nov 27 2019 10:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment