TTD council
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ► అలాగే రెండో ఘాట్రోడ్లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ► తిరుమల బాలాజీ నగర్లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్ల మంజూరు ► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు ► టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది టీటీడీ పాలకమండలి. -
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక సమావేశం గురువారం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం టీటీడీ నిర్వహించనుంది. తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశంలో పాల్గొంటుండగా మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొననున్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి పాలకమండలి సమావేశం కీలకంగా మారింది. ► ప్రధానంగా టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారడం, ప్రభుత్వం గత పాలకమండలి తీర్మానాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశంపై పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ► మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేత కారణంగా టీటీడీ ఇప్పటికే రూ.400 కోట్ల రాబడి కోల్పోయింది. మే నెల జీతాలు చెల్లింపు తరువాత టీటీడీ వద్ద నిధుల కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు వాడకుండా ఓడీ (ఓవర్‌డ్రాప్ట్)కి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎస్బీఐలో టీటీడీకి రూ.300 కోట్లు ఓడీ 0.75 శాతం వడ్డీకే లభించే అవకాశం ఉంది. ► ఇక శ్రీవారి ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభించే సమయంలో ఏ విధానాన్ని అవలంబించాలన్న అంశంపైనా పాలకమండలి ఫోకస్ పెట్టనుంది. మొదటి దశలో రోజుకి 7వేల మంది భక్తులకే దర్శనభాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసి తర్వాత విడతల వారీ మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలపనుంది. ► మరో వైపు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి అనుమతులు జారీ చేయనుంది. గరుడ వారధికి నిధులు కేటాయింపు అంశంపై ఈ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ► టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి సంబంధించి 47 పోస్టులు భర్తీ ప్రకియ మొదలు పెట్టే అంశం పై పాలకమండలి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఇక అవిలాల చెరువును తుడాకి అప్పగించే అంశంపైనా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపుపైనా చర్చించనుంది. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ఆర్ నవశకం’ పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు గాను కొత్తగా రూపొందించిన అర్హత మార్గదర్శకాలకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో.. - ‘జగనన్న విద్యా దీవెన’ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున ఇవ్వాలన్న ప్రతిపాదనలకు, డిగ్రీ ఆ పైన కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టల్ ఫీజుల కింద ఏటా రూ.20వేల చొప్పున ఇచ్చే ‘జగనన్న వసతి’కి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. - టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానే కేబినెట్లో ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లులో సవరణలు చేయనున్నారు. - పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. - సీఆర్డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి.. వేటిని చేపట్టకూడదనే అంశంపై చర్చించే అవకాశంఉంది. - వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
కొలువుదీరిన కొత్త పాలకమండలి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఆ వెంటనే చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. తొలి సమావేశంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయిం చారు. అమరావతిలో టీటీడీ నిధులతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం అంచనాలకు మించి జరిపిన కేటాయింపులను కుదిం చారు. తిరుమల శాశ్వత తాగునీటి పరిష్కారా నికి బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేయాలని నిర్ణ యం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక అభివృద్ధి పనులు పూర్తిచేసే విషయమై చర్చిం చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీటీడీ పాలకమండలి సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఏడుగురు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి పాలకమండలి సమావేశం జరిగింది. ఈనెల 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. తిరుమల శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం దిశగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు, స్థానికులకు మంచినీటి సమస్య లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి అక్కడి నుంచి మల్లిమడుగు, కళ్యాణి డ్యాం నుంచి నీటిని సరఫరా చేసే విషయమై చర్చిం చారు. ఈ విషయమై గతంలోనే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బాలాజీ రిజర్వాయర్ని పరిశీలించిన విషయం తెలిసిందే. బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు వంటి వాటి గురించి సమావేశంలో ప్రస్తావించారు. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసేందుకు రూ.150 కోట్లు అంచనా వేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన అంచనాలను వచ్చే పాలకమండలి సమావేశంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి నట్లు తెలిసింది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించే విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కాలుష్య రహిత వాహనాల విషయమై చర్చిం చారు. అందులో భాగంగా తిరుమలలో ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు నడపాలని నిర్ణయించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. టీటీడీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేసిన వెంట నే సమావేశం ఏర్పాటు చేసి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. టీటీడీ పాలకమండలి సమావేశంలో లడ్డు ధరపై వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. ఆర్జిత సేవలు, లడ్డూ ధరల పెంపుపై చర్చ జరుపుతున్నారు. లడ్డూ ధర పెంచాలి లేకుంటే పరిమాణం తగ్గించాలని ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి పట్టుపట్టినట్టు తెలుస్తోంది. లడ్డూ ధర పెంపును పాలకమండలి సభ్యుల్లో కొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమను అవమానించారంటూ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.