తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. టీటీడీ పాలకమండలి సమావేశంలో లడ్డు ధరపై వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. ఆర్జిత సేవలు, లడ్డూ ధరల పెంపుపై చర్చ జరుపుతున్నారు. లడ్డూ ధర పెంచాలి లేకుంటే పరిమాణం తగ్గించాలని ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి పట్టుపట్టినట్టు తెలుస్తోంది.
లడ్డూ ధర పెంపును పాలకమండలి సభ్యుల్లో కొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమను అవమానించారంటూ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం
Published Tue, Oct 27 2015 11:59 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM
Advertisement