టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తాం
విజయనగరం మున్సిపాలిటీ: అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమ రాజకీయాలను బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజలకు తెలియజెప్పేందుకు మం గళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల.వీరభద్రస్వామి తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలనుసారం జిల్లాలో గల 9 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సోమ వారం సాయంత్రం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంలో పక్కాగా పట్టుబడిన టీడీ పీ నాయకుడు రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణలు బయటపడడంతో తెలుగు ప్రజలు ఆయన్ను అసహ్యించుకుం టున్నారన్నారు. అదేవిధంగా టీడీపీ సర్కారు ఏడాది పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలు కానీ, వారు పదవులు అలంకరించిన రో జున చేసిన ఐదు సంతకాలు కానీ అ మలు కాదని ఈ విషయాన్ని ప్ర జల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశా రు. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30 గం టలకు విజయనగరం జిల్లా కేంద్రంలో గల మయూరి జంక్షన్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.
చంద్రబాబు రియల్ ఎస్టేట్
సింగపూర్‌లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలెప్‌మెంట్ అథారిటీ కింద సీఆర్‌డీఏను పరిచయం చేసి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు యత్నిస్తున్నారని, అందుకు ప్రభుత్వం తీరు మరింత ఊతమిస్తోందని కోలగట్ల ఆరోపించారు. పార్టీ ఆదేశానుసారం ఇప్పటి వరకు జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలు పూర్తిచేశామని, గ్రామ, వార్డు, బూత్ స్థాయి కమిటీలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
మునిగిపోయే పడవలోకి ఎవరు వెళ్తారు?
నాలుగేళ్లలో మునిగిపోయే టీడీపీ సర్కారు అనే పడవలోకి ఎవరు వెళ్తారని కోలగట్ల అన్నారు. వైఎస్సార్‌సీపీలో బొత్స చేరిక నేపథ్యంలో బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన రాజులు టీడీపీలో చేరే అవకాశం ఉందన్న విలేకరుల ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. బొత్స చేరికతో వారిలో అసంతృప్తికి అవకాశం లేదని చెప్పారు. రాజకీయాల్లో కీలక పదవులు అధిరోహించి పార్టీలో చేరిన బొత్సకు వైఎస్‌ఆర్‌సీపీలో ఎలాంటి పదవి ఇవ్వబోతారన్న మరో ప్రశ్నకు రాజకీయాల్లో పని విధానం బట్టి పదవులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.