
బాబూ... సీఎం పదవి వదులుకుంటావా?
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
హైదరాబాద్: అర్హత ఉన్నా ఆధార్ కార్డు లేదంటూ పేద ల పింఛన్లు, రేషన్‌కా ర్డులు రద్దు చేస్తున్నా రు..ఏపీలో ఓటర్ ఐడీ కార్డు లేని చంద్రబా బు కార్డు వచ్చే వరకు సీఎం పదవి వదులుకుంటారా? అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఇందిర భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డులు ఇచ్చే వరకు పేదలకు పథకాలు కొనసాగిస్తారో లేక ఓటర్ ఐడీ కార్డు వచ్చే వరకు చంద్రబాబు సీఎం పదవి నుంచి తప్పుకుంటారో జవాబు చెప్పాలన్నారు. సుజనా చౌదరి ఆ పార్టీకి పెట్టుబడి పెట్టడం వల్లే కేంద్ర మంత్రి పదవి దక్కిందని ఆయన విమర్శించారు. అనంతరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 126వ జయంతి సందర్భంగా ఇందిర భవన్‌లో ఆయన చిత్ర పటానికి రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.