మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ | AP DGP Gautam Sawang Has Launched a Breast Cancer Awareness Program | Sakshi
Sakshi News home page

మహిళలకు అవగాహన పెరగాలి : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Published Tue, Oct 29 2019 11:05 AM | Last Updated on Tue, Oct 29 2019 11:12 AM

AP DGP Gautam Sawang Has Launched a Breast Cancer Awareness Program - Sakshi

సాక్షి, విజయవాడ : సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. మంగళవారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం సిద్దార్ధ కళాశాల నుంచి నిర్వహించిన 3k వాక్‌ ను ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. జీవనశైలిలో మార్పుల కారణంగా ఎక్కువమంది మహిళలు రొమ్ముక్యాన్సర్‌ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ, పౌష్టికాహారం​ తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement