
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభకోణంపై పూర్తి విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ సభ్యులుగా వైవీ అనురాధ, టి.భాస్కర్‌రావును నియమించింది. విశాఖ జిల్లాలో భూముల అక్రమాలపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment