సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, రూ.1000 ఆర్థిక సాయంతో పాటు.. అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గిరిజన కుటుంబానికీ చేర్చాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ గిరిజన ప్రాంతాలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాలను చేర్చడం, క్వారంటైన్, భౌతిక దూరం అమలుపై సోమవారం ఐటీడీఏ పీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
► సీతంపేట, పాడేరు, కేఆర్‌పురం, చింతూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల పీవోలతో మంత్రి మాట్లాడుతూ గిరిశిఖర గ్రామాలు, రహదారుల్లేని గిరిజన గ్రామాలకు రేషన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు.
► నెల్లూరు యానాది ఐటీడీఏ పరిధిలో సంచారజాతికి చెందిన 900 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకున్నా ఉచిత రేషన్ పంపిణీచేసినట్టు నెల్లూరు పీవో మణికుమార్ చెప్పారు.
► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను క్వారంటైన్ కేంద్రంలో ఉంచి గడువు ముగిశాక వారిని స్వగ్రామాలకు పంపినట్టు చింతూరు పీవో చెప్పారు.
ప్రతి గిరిజన కుటుంబానికీ ప్రభుత్వ సాయం
Published Tue, Apr 7 2020 3:45 AM | Last Updated on Tue, Apr 7 2020 3:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment