సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంపికయిన వారికి ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్ల వయసు నిండి 35 ఏళ్లకు మించని వారంతా ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌సైట్ (https://gswsvolunteer,apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్ , పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివాసులై ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి అవకాశం లేని వారు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో సంప్రదించి, అక్కడ సిబ్బంది సహయంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment