volunteers recruitment
-
వాలంటీర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంపికయిన వారికి ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్ల వయసు నిండి 35 ఏళ్లకు మించని వారంతా ఆన్లైన్లో ఈ వెబ్సైట్ (https://gswsvolunteer,apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్ , పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివాసులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి అవకాశం లేని వారు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో సంప్రదించి, అక్కడ సిబ్బంది సహయంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. -
15 నుంచి వలంటీర్ల ఖాళీల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ల పోస్టుల ఖాళీలన్నింటినీ ఈనెల 15 నుంచి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వలంటీర్ల పోస్టులు ఖాళీ అన్న మాటే తనకు వినిపించకూడదన్నారు. వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రయోజనాలు నెరవేరవని, చివరి స్థాయిలో అనుసంధానం నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి వలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామ వలంటీర్లుగా ఉన్నవారు కొంతమంది గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలు రాసి ఎంపికైనందున వలంటీర్ల పోస్టులు ఖాళీ అయ్యాయని, అలాంటి చోట్ల వెంటనే భర్తీ చేపట్టాలని సీఎం సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట వలంటీర్ల విద్యార్హతలను తగ్గించే అవకాశాలను పరిశీలించాలని, ఇంటర్‌ను అర్హతగా పరిగణిస్తే వార్డు వలంటీర్ల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జనవరి నుంచి 500 రకాలకుపైగా సేవలు.. గ్రామ, వార్డు సచివాలయాలు గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో డిసెంబర్ కల్లా అన్నీ సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తూ దాదాపు 500 రకాలకు పైగా సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందజేయాలని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాక ప్రతి రోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలన్నారు. వైఎస్సార్ కంటి వెలుగుపై సమీక్ష ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కింద ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. సిబ్బందికి కిట్లను పంపిణీ చేస్తున్నామని, అక్టోబరు 10 నుంచి 16 వరకు విద్యార్ధులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు చికిత్స కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పౌష్టికాహార లోప నివారణపై చర్యలు మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు గ్రామ వలంటీర్ల ద్వారా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు గతంలో రూ.8 ఇస్తుండగా రూ.18 వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తల్లులకు మంచి ఆహారం అందించడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, ఆ తర్వాతే వివాహం గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నారు. 21 ఏళ్లు దాటాకే ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో రక్తహీనత సమస్య అధికంగా ఉందని, చిన్న వయసులో వివాహాల కారణంగా పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పెద్దలను ఆదరిద్దాం.. రాష్ట్ర స్థాయి సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం నలుగురు సీనియర్ సిటిజన్స్ ఈ కౌన్సిల్లో ఉండాలని సూచించారు. నెలకు ఒకసారి వారు తనతో సమావేశం అవుతారని చెప్పారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిల్లో కూడా ఈ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం తప్పదని, ఇవాళ మనం వారిని సరిగా చూసుకోకపోతే.. రేపు మనల్ని చూసుకునేవాళ్లు కూడా ఉండరని సీఎం పేర్కొన్నారు. 4న ఏలూరులో ‘వైఎస్సార్ వాహనమిత్ర’ ప్రారంభం ఆటోలు, కార్లు, ట్యాక్సీలు సొంతంగా నడుపుకొనేవారికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద రూ.10 వేలు చొప్పున అందజేసే కార్యక్రమాన్ని అక్టోబర్ 4వ తేదీన ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం టెస్ట్‌రన్ కూడా నిర్వహించింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఇప్పటివరకు 1,75,309 దరఖాస్తులు అందగా 1,67,283 దరఖాస్తులను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. 5న వైఎస్సార్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితా! వైఎస్సార్ రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ఈనెల 5వతేదీన గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. అక్టోబరు 8న తుది జాబితాను వ్యవసాయశాఖకు పంపించాలన్నారు. ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇదే తొలిసారి.. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధి దారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడా ఈ స్థాయిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టలేదని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని చెప్పారు. -
మీరే నా స్వరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశమంతా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసమే కొత్తగా వలంటీర్ల వ్యవస్థను తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే నేరుగా ప్రభుత్వ సేవలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లుగా నియమితులై బాధ్యతల్లో చేరుతున్న సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. విజయవాడలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వలంటీర్లు హాజరు కాగా మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద దీన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3,648 కి.మీల దూరం సాగిన తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయని వారు కూడా ఐదేళ్లలో తాము చేసే మంచి పనులను చూసి వచ్చే దఫా తమకే ఓటు వేసేలా వారి మనసు కరగాలన్నది తమ లక్ష్యమన్నారు. ఈ ఏడాదే 80 శాతం హామీల అమలు... నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలోని ఇతర పథకాల అమలు కూడా వలంటీర్ల ద్వారానే జరుగుతుందని సీఎం చెప్పారు. వలంటీర్లే ప్రభుత్వ స్వరం లాంటివారన్నారు. ప్రతి వలంటీర్ వద్ద మేనిఫెస్టో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని 80 శాతం పైచిలుకు హామీలను ఈ సంవత్సరమే అమలులోకి తెస్తామని, వచ్చే ఏడాది మిగిలిన 20% అమలులోకి తెస్తామని జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏం మాట్లాడారో వివరాలు ఆయన మాటల్లోనే... వలంటీర్లంటే ... ‘‘వలంటీరు అంటే మూడు పదాల్లో.. లబ్ధిదారుల గుర్తింపు, డోర్ డెలివరీ, 50 ఇళ్లకు తోడుగా ఉండడం. వలంటీర్లు చేయాల్సిన బాధ్యతలన్నీ ఈ మూడు పదాలలోనే కలసి పోతాయి. ఈ ప్రక్రియలో వలంటీర్లు గ్రామ సచివాలయం, కలెక్టర్లతో అనుసంధానం అవుతారు. ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడం, లబ్ధిదారులను గుర్తించడం రెండు కళ్లు లాంటివి అయితే మూడోది 50 ఇళ్లకు లీడర్షిప్ తీసుకోవడం. ఆ 50 ఇళ్లకు ఏ పనైనా వలంటీర్లే దరఖాస్తు చేయించాలి. వచ్చేలా చేయాలి. ఆ తర్వాత కార్డు కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి. అప్పుడే వలంటీరుగా తన బాధ్యత నెరవేర్చినట్లు అవుతుంది. వలంటీర్ల వ్యవస్థలో అవినీతి అనేది ఉండకూడదు. పనిచేసే వారికి ఆ ఆలోచన, ఆ తలంపు కూడా రాకూడదనే ప్రతి ఒక్కరికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నాం. తమకు కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించే వలంటీర్లను లీడర్లుగా చేస్తాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా పారదర్శకత, చిరునవ్వుతో అందరికీ సహాయం చేస్తే 50 ఇళ్లకు మీరు చేసే మంచితో వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు. 3 నెలల్లో లక్షల ఉద్యోగాలిచ్చిన చరిత్ర.. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా తిరగక మునుపే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర బహుశా ఎక్కడా లేదు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ద్వారా దాదాపు 1.40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 2.80 లక్షల మందిని వలంటీర్లుగా నియమించాం. దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చాం. ప్రతి నెలా కచ్చితంగా ఒక కార్యక్రమం.. చాలా పథకాల అమలుకు వలంటీర్ల నియామకం కోసం వేచి చూస్తున్నాం. ఇక మీరొచ్చారు కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. గ్రామ సచివాలయాలు అక్టోబరు 2న గాంధీ జయంతి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఈ సంవత్సరం మనం చేయబోయే పెద్ద కార్యక్రమాలు రైతు భరోసా, అమ్మ ఒడి. మరొకటి రాబోయే ఉగాది నాటికల్లా రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదవాడు ఎవరూ ఉండకూడదు. పింఛన్‌ను మేం వచ్చిన వెంటనే రూ.2,250తో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళుతున్నాం. అన్నీ బాగుంటే సెప్టెంబరు నుంచే అటో డ్రైవర్లు, సొంతంగా టాక్సీ కలిగిన వారికి సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అక్టోబర్ నుంచి వైఎస్సార్ రైతు భరోసా మొదలవుతుంది. నవంబరు నాటికి మరికొన్ని పథకాలున్నాయి. చేనేతలకు సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తామని చెప్పాం. షాపులున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.పది వేల చొప్పున సాయం చేస్తామని చెప్పాం. ఈ లబ్ధిదారులను గుర్తించే బాధ్యత వలంటీర్లదే. ఇలా నెలకొక కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి.. వలంటీర్ల ద్వారా బియ్యం డోర్ డెలివరీ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలవుతుంది. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి అందచేస్తాం. దీన్ని క్రమంగా విస్తరించి ఏప్రిల్ కల్లా ప్రతి జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్నిస్తే ఓపిగ్గా సమాధానం చెప్పాలి.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే వలంటీర్లకు అన్ని కార్యక్రమాలపై అవగాహన ఉండాలి. ఏ పథకంపై ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఆ అవగాహన రావాలంటే నేను ఏం మాట్లాడుతున్నానో వింటూ ఉండాలి. మనం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే కొంచెం ఓపిగ్గా సమాధానం చెప్పాలి. మనం ప్రతి పథకాన్ని ప్రారంభిస్తూనే ఉన్నాం. వలంటీర్లకు ఎదురయ్యే ప్రశ్నలను గుర్తించి సావధానంగా ఎలా వివరించాలో తెలియచేసేందుకు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం’’ ‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’ ‘ప్రతి లబ్ధిదారుడికి మంచి చేసే విషయంలో వలంటీర్ల నుంచి ముఖ్యమంత్రిగా నేను ఆశించేవి రెండే రెండు. ఒకటి లంచాలు ఉండకూడదు, రెండు వివక్ష చూపకూడదు. మన, తన తేడా చూపకూడదు. ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ. ఎవరైనా పర్వాలేదు. కచ్చితంగా సహాయం అందాలి. ఇదే వలంటీర్ల నుంచి నేను ఆశించేది’ ‘రాష్ట్ర ప్రజలందరికీ భరోసా నింపేందుకు నా దగ్గర మొదలైన ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అన్న స్వరం మీది (వలంటీర్లు) కూడా కావాలి’ – వలంటీర్ల వ్యవస్థ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ ఏ ముఖ్యమంత్రీ చేయలేరు: మంత్రి పెద్దిరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన దేశ చరిత్రలోనే అద్వితీయ ఘట్టమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మరే రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదని, మళ్లీ అలాంటిది జరిగితే జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా మరే సీఎం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరన్నారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు, గిరిజా శంకర్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు వలంటీర్ల కరదీపికను సీఎం ఆవిష్కరించారు. కొందరు వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రతి ఇంట్లో సీఎం ఫొటో... అందరికీ మేలు చేయాలన్న తలంపుతో పనిచేస్తున్న యువ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ప్రతి కుటుంబం తమ ఇంట్లో, మనసులో భద్రంగా దాచుకుంటుంది. –ఆరేపల్లి ప్రతాప్, విజయవాడ -
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్
-
ఐ లవ్ యూ.. జగనన్నా..
సాక్షి, విజయవాడ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ వాలంటీర్ మాట్లాడుతూ.. ‘‘ అన్నా.. ఐ లవ్ యూ.. జగనన్నా.. స్పీచ్ లెస్ అన్నా. ఒక పేదవాడికి మన ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్లాలి అని దూరంగా ఆలోచించి మమ్మల్ని వాలంటీర్లుగా ఎన్నుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి అని పెట్టి దోచుకుంది. మాకు మీరు 50 కుటుంబాలు అప్పజెప్పారు. నేను 50 కుటుంబాలకు ప్రతినిధిని. అందుకు నేనెంతో గర్వ పడుతున్నాను. 50 మంది ఇళ్లలో సేవ చేసుకుంటూ బ్రతకటం చాలా హ్యాపీగా ఉందన్నా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వాలంటీర్లుగా ఎంపికవటం మా అదృష్టం తిరుపతి : వార్డు వాలంటీర్లుగా ఎంపికవటాన్ని తాము అదృష్టంగా భావిస్తున్నామని తిరుపతి వార్డు వాలంటీర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు చక్కటి అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. 50 నివాస గృహాలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గురువారం తిరుపతి మున్సిపల్ స్టేడియంలో వాలంటీర్ల అవగాహన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ వాలంటీర్ల మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని తెలిపారు. అనంతరం వార్డు వాలంటీర్లకు ఐడీ కార్డులను అందజేశారు. -
దేశ చరిత్రలో అద్వితీయ ఘట్టం: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి : గ్రామ వాలంటీర్లు తమపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. వాలంటీర్లకు కేటాయించిన 50 కుటుంబాల సమస్యలను 72 గంటల్లో పరిష్కరించాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా...ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...దేశ చరిత్రలోనే ఇదొక అద్వితీయ ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మానస పుత్రిక అయిన నవరత్నాల ద్వారా ప్రభుత్వం నుంచి దాదాపు 35 కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయబోతున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకాలు లేవన్నారు. ఇక రాష్ట్రంలో 11,128 గ్రామ, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 4 లక్షల 20 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు స్వలాభంతో పనిచేశాయని విమర్శించారు. ఓడిపోయిన టీడీపీ నేతలను ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారని ఆరోపించారు. అయితే సీఎం జగన్ ప్రభుత్వంలో తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అలాంటిది కాదని, దీని ద్వారా అర్హులైన వారికి త్వరితగతిన పథకాలను చేరువ చేస్తామని వెల్లడించారు. చదవండి: గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్ -
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని.. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. దీంతో ప్రజాసంకల్పయాత్రంలో వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామస్వరాజ్యం దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది పలికింది. దీనికి సీఎం శ్రీకారం చూట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని అన్నారు. ‘గడిచిన 73 ఏడేళ్లలో ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంకా స్వాతంత్య్రానికి దూరంగా ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధిలేదన్న విషయాన్ని 3648 కి.మీ నా సుధీర్ఘ పాదయాత్రలో చూశాను. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఉండాలి. దానిలో భాగమే గ్రామ వాలెంటీర్ల వ్యవస్థ. లంచాలు, వివక్ష, కులాలు, మతాలు, రాజకీయాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలెంటీర్లు పనిచేయాలి. నా స్వరం మీనోటి వెంట రావాలి.. వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరగకముందే 4లక్షల ఉద్యోగాలు కల్పించిన చరిత్ర దేశంలో ఇప్పటి వరకూ లేదు. నేను విన్నాను నేను ఉన్నాను అని నా నోట వచ్చిన స్వరం.. ఇప్పటి నుంచి మీనోట కూడా కావాలి. గ్రామ వాలెంటీర్లు చేసే పనులు ఎంతో కీలకమైనవి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం, డోర్ డెలివరీ చేయడం. సెప్టెంబర్ 1న శ్రీకాకుళం నుంచి రేషన్ బియ్యం డోర్‌డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతి పథకం పేదలకు చేరాలి. ప్రధానంగా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందాలి. రైతు భరోసా అక్టోబర్ 15న ప్రారంభిస్తాం. ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా రూ.12500 ఇవ్వాలని నిర్ణయించాం. లబ్ధిదారుల ఎంపికలో లంచాలు, వివక్ష ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందారు. రాష్ట్రంలో ఇంటిస్థలం లేని వారు ఎవరూ ఉండకూడదు. ఉగాది నాటికి అందరికీ ఇంటి స్థలాలను చూపించాలి. దీనిలో వాలెంటీర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీలోనుంచే నేను లీడర్లను తయరుచేస్తాను’ అని అన్నారు. 2,66,796 మంది వాలంటీర్ల నియామకం కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వాలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా గురువారం నుంచే విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. సగం మంది మహిళలే.. వాలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. -
నేడు విధుల్లోకి వలంటీర్లు
సాక్షి, అమరావతి: పూజ్య బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. వీరంతా గురువారం విధుల్లో చేరనున్నారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్సీడీలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ, వార్డుల వారీగా నియమితులైన వలంటీర్లు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల వద్ద తొలిరోజు సమావేశమవుతారు. మండల కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పాల్గొంటారని, వారితో సీఎం ముఖాముఖి మాట్లాడుతారని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. సగం మంది మహిళలే.. వలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. విధుల్లో చేరగానే బేస్‌లైన్ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్లు విధుల్లో చేరనున్నారు. వలంటీర్లు బాధ్యతలు చేపట్టగానే వారి ద్వారా ప్రతి కుటుంబం వివరాలను సేకరించాలని, ఈ మేరకు బేస్‌లైన్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబం వారీగా ప్రతి సభ్యుడి సమగ్ర వివరాలను తెలుసుకునేలా 13 పేజీల సర్వే ప్రొఫార్మాను సిద్ధం చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపినట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. -
గ్రామవాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ఎలీజా
-
‘అవి బాహుబలి నియామకాలు’
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలిపి మొత్తంగా 3,65,561 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు 2.30 లక్షల గ్రామ వలంటీర్లను నియమిస్తున్నామని తెలిపారు. ఈ స్థాయిలో ఏ సీఎం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇవి బాహుబలి నియామకాలని ప్రశంసించారు. సెలెక్షన్ అంతా డీఎస్పీ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. (చదవండి : రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ నియామకాలు) -
ఉద్యోగాంధ్ర
రాష్ట్ర చరిత్రలో నూతన శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా ఒకేసారి లక్షలాది ఉద్యోగ నియామకాలకు నాంది పలికారు.. ఈ పరిణామంతో ప్రజల లోగిళ్లకు ప్రభుత్వ పథకాలు చేరడానికి మార్గం సుగమం అవుతోంది.. ప్రభుత్వ వ్యవస్థ కూతవేటు దూరానికి తరలివస్తోంది.. సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సువర్ణయుగం ప్రారంభమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థను మరింత దగ్గర చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చే కార్యక్రమాలకు ఈ ఉద్యోగ నియామకాల ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అదీ ఒకేసారి ఇన్ని లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు అందుతుండడం ఒక అపూర్వఘట్టం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు. ఈ ఉద్యోగ నియామకాలతో పరిపాలనా వ్యవస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. స్థానిక పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం మరింత సన్నిహితం కావడమే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దకే చేరనుండడం విశేషం. ఈ ఉద్యోగాల్లో 1,33,494 శాశ్వత ఉద్యోగాలు కావడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ సేవలందించేందుకు ఈ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఈ ఉద్యోగ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తున్నారు. తద్వారా 2,67,506 మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే స్వచ్ఛంద సేవకునిగా ఉద్యోగ అవకాశం లభించనుంది. శాశ్వత ఉద్యోగాల్లో నియామకమయ్యే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతన, భత్యాలు అందనుండగా వలంటీర్లకు ప్రతినెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. ప్రజలకు ఇక త్వరితగతిన సేవలు దాదాపు దశాబ్దం కాలంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేక ఉపాధి అవకాశాలూ కానరాక రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. వీరిని ఆదుకొంటామని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకు వస్తామని, వాటి ద్వారా శాశ్వత ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందించేలా వలంటీర్లను నియమిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే వాటికి కార్యరూపం ఇవ్వడం విశేషం. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగలేదని, ఈ ప్రభుత్వం తమ జీవితాలకు వెలుగులు ప్రసాదించిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. మరోపక్క క్షేత్ర స్థాయిలో కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగ నియామకాలు లేక ప్రభుత్వ కార్యక్రమాల అమలు కుంటు పడుతోంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ నియామకాలతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఊపందుకోవడంతో పాటు పాలనా వ్యవహారాలు పరుగులు తీయడానికి, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో 99,144, పట్టణాల్లో 34,350 ఉద్యోగాలు ప్రభుత్వం ఒకేసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుండడంతో యువతలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ ఉద్యోగాల సాధన ద్వారా తమ జీవితాల్లో కొత్త వెలుగులు సంతరించుకుంటాయని భావిస్తున్నారు. ‘గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాం. గత ప్రభుత్వ హయాంలో ఆశించిన నోటిఫికేషన్లు లేవు. వచ్చినా ఆ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని విజయవాడలో శిక్షణ పొందుతున్న పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,33,494 శాశ్వత ఉద్యోగాల్లో 34,350 పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల ద్వారా అందుతుండగా.. మిగతా 99,144 పోస్టులు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కాకుండా పట్టణాల్లో 74,185, గ్రామాల్లో 1,93,321 వలంటీర్ల పోస్టులు యువతకు వరంగా మారుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ పరిపుష్టం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల వల్ల పంచాయతీ వ్యవస్థ మరింత పరిపుష్టం కానుంది. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు కేంద్రం 1994లోనే అనేక అధికారాలు కల్పించినా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ అధికారాలను వాటికి దక్కకుండా తన గుప్పెట్లోనే పెట్టుకుంది. ఆ తర్వాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలకు అధికారాలు బదలాయించారు. అయితే తదనంతర ముఖ్యమంత్రులు వాటి ద్వారా ప్రజలకు సేవలందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఉద్యోగ నియామకాలకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడంతో పాటు వైఎస్ జగన్ మానస పుత్రికలైన నవరత్నాల పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన ఉద్యోగ వ్యవస్థ కీలక భూమిక పోషించనుంది. అదే సమయంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శే కన్వీనర్‌గా వ్యవహరించేలా, వీరందరినీ పర్యవేక్షిస్తూ సెలవులు ఇచ్చే అధికారం సర్పంచులకే ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు ఈ సచివాలయ పరిధిలోకి వస్తారు. కూతవేటు దూరంలో ప్రభుత్వ యంత్రాంగం గ్రామ, పట్టణ వార్డు సచివాలయాల్లో లక్షలాది ఉద్యోగుల నియామకం, అంతకు రెట్టింపు సంఖ్యలో వలంటీర్ల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగ సేవలు కూతవేటులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానంతో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే వలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. శాశ్వత ఉద్యోగాలకు కావలసిన అర్హతలను, ఇతర నైపుణ్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టభద్రులు, ఇంజనీర్లు, పాలిటెక్నిక్ డిప్లొమో పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్ వర్క్, నర్సింగ్‌లో ఫార్మా డీ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల కల్పనలో మొన్నటి దాకా బిహారే నయం బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ వాడా ఊదర గొట్టిన చంద్రబాబు.. సీఎం పదవి చేపట్టిన తర్వాత కొత్తగా జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశారు. బాబు ఐదేళ్ల పదవీ కాలంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఖాళీగా ఉన్న నాలుగవ తరగతి పోస్టులను ఏకంగా రద్దు చేశారు. దీంతో గత ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఉద్యోగాల కల్పనలో బిహార్ రాష్ట్రం కన్నా ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నంగా తయారైందని 2017–18 లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 13.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 శాతం నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళా నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో 27 శాతం మహిళల్లో నిరుద్యోగం ఉండగా. పురుషుల్లో 20.4 శాతం నిరుద్యోగులున్నారని సర్వే గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పట్టభద్రుల్లో అత్యధికంగా 23.6 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, డిప్లమా/ సర్టిఫికెట్ హోల్డర్లలో 17.6 శాతం నిరుద్యోగులుగా ఉన్నారని సర్వే పేర్కొంది. సెకండరీ, ఉన్నత విద్యలో బిహార్ కన్నా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నిరుద్యోగులున్నారని, దేశ సగటు కన్నా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో పాటు జాతీయ కుటుంబ సర్వే – 4 ప్రకారం చూసినా రాష్ట్రంలో ఉద్యోగాలు లేని వారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో 2005–06లో 15 – 49 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఉద్యోగాలు లేని పురుషులు 0.8 శాతం ఉండగా 2015–16 లో ఇది 3.9 శాతానికి పెరిగినట్లు జాతీయ కుటుంబ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న పురుషులు 2005–06లో 87.5 శాతం ఉండగా 2015–16 నాటికి 79.6 శాతానికి తగ్గిపోయినట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. ఇదే వయస్సు గల వారిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 2005–06లో 50 శాతం ఉండగా, 2015–16 నాటికి 33 శాతానికి పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఇదో సువర్ణావకాశం మన ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 1.33 లక్షల మందికి ఉపాధి దొరకడం మంచి పరిణామం. దీంతో పాటు ఈ ఉద్యోగులు తమ గ్రామ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తా్తరు. దీనివల్ల సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందుతుంది. తమ ప్రాంత ప్రజలకే సేవలందిస్తున్నామనే భావన వల్ల అవినీతికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ఇప్పటికే పంచాయతీలలో సేవలు అందిస్తున్న వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తే గ్రామ పరిపాలనలో అసంతృప్తికి అవకాశం ఉండదు. మొత్తం మీద గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. రాషŠట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశం. – టీఎంబీ బుచ్చిరాజు, చైర్మన్. ఆర్ విక్టర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగుల్లో ఆనందం కలిగిస్తున్నాయి. 4 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర చర్రితలో సువర్ణాక్షరాల్లో లిఖించదగ్గ రికార్డు. ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పన పట్ల జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు జగన్ సర్కారు బాటలు వేస్తోందని చెప్పవచ్చు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే చేర్చడం విప్లవాత్మక చర్య. – వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు. -
గ్రామ వాలంటీర్ల నియామకంకోసం నోటిఫికేషన్
-
గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వ నోటిఫికేషన్
-
'ఆ తర్వాతే కొత్త టీచర్ల నియామకం'
హైదరాబాద్: కొత్త జిల్లాలు, రేషనలైజేషన్ పూర్తిచేసిన తర్వాతే కొత్త టీచర్ల నియామకం చేపడుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం కడియం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు 9, 335 వాలంటీర్ల నియామకం చేపడుతామని తెలిపారు. ఫీజులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు మళ్లీ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పారు. జులై నెలాఖరకు కల్లా అన్ని వర్సిటీలకు వీసీల నియామకం జరుగనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలు పూర్తైందని.. జులై 5 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.