హైదరాబాద్: కొత్త జిల్లాలు, రేషనలైజేషన్ పూర్తిచేసిన తర్వాతే కొత్త టీచర్ల నియామకం చేపడుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం కడియం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు 9, 335 వాలంటీర్ల నియామకం చేపడుతామని తెలిపారు.
ఫీజులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు మళ్లీ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పారు. జులై నెలాఖరకు కల్లా అన్ని వర్సిటీలకు వీసీల నియామకం జరుగనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలు పూర్తైందని.. జులై 5 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
'ఆ తర్వాతే కొత్త టీచర్ల నియామకం'
Published Wed, Jun 29 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement