![Minister Peddireddy Ramachandra Reddy Say 4 Laks Jobs Appointed For Village Secretary - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/22/Peddireddy-Ramachandra-Redd.jpg.webp?itok=pAKmPFEo)
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలిపి మొత్తంగా 3,65,561 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు 2.30 లక్షల గ్రామ వలంటీర్లను నియమిస్తున్నామని తెలిపారు. ఈ స్థాయిలో ఏ సీఎం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇవి బాహుబలి నియామకాలని ప్రశంసించారు. సెలెక్షన్ అంతా డీఎస్పీ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు.
(చదవండి : రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ నియామకాలు)
Comments
Please login to add a commentAdd a comment