సాక్షి, విజయవాడ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ వాలంటీర్ మాట్లాడుతూ.. ‘‘ అన్నా.. ఐ లవ్ యూ.. జగనన్నా.. స్పీచ్ లెస్ అన్నా. ఒక పేదవాడికి మన ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్లాలి అని దూరంగా ఆలోచించి మమ్మల్ని వాలంటీర్లుగా ఎన్నుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి అని పెట్టి దోచుకుంది. మాకు మీరు 50 కుటుంబాలు అప్పజెప్పారు. నేను 50 కుటుంబాలకు ప్రతినిధిని. అందుకు నేనెంతో గర్వ పడుతున్నాను. 50 మంది ఇళ్లలో సేవ చేసుకుంటూ బ్రతకటం చాలా హ్యాపీగా ఉందన్నా’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
వాలంటీర్లుగా ఎంపికవటం మా అదృష్టం
తిరుపతి : వార్డు వాలంటీర్లుగా ఎంపికవటాన్ని తాము అదృష్టంగా భావిస్తున్నామని తిరుపతి వార్డు వాలంటీర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు చక్కటి అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. 50 నివాస గృహాలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గురువారం తిరుపతి మున్సిపల్ స్టేడియంలో వాలంటీర్ల అవగాహన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ వాలంటీర్ల మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని తెలిపారు. అనంతరం వార్డు వాలంటీర్లకు ఐడీ కార్డులను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment