ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు
హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదలచేసింది. మంగళవారం నుంచి బదీలల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సోమవారం రాత్రి హడావిడిగా సంబంధిత జీవో నంబర్ 57ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారికి బదిలీ తప్పనిసరి.
కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసినవారు బదిలీ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్లలో రిటైర్ కానున్నవారిని బదిలీ చెయ్యొద్దని అదేశాలు జారీచేసింది, కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించే ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తిచేయాలని సూచించింది. బదిలీల ప్రక్రియను ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు.