సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలు | ap govt funds released to rtc over cm pantry vehicle | Sakshi
Sakshi News home page

సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలు

Published Wed, Nov 9 2016 9:26 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలు - Sakshi

సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలు

సీఎం ప్యాంట్రీ వాహనానికి రూ.30.94 లక్షలిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు ప్యాంట్రీ వాహనంలో సౌకర్యాలను కల్పించినందుకు గాను ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.30.94 లక్షల్ని రీ యింబర్స్ చేసేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు పర్యటనల కోసం సమకూర్చిన ప్యాంట్రీ వాహనంలో కిచెన్, చిమ్నీ, గీజర్, ఫ్రిజ్ తదితర సౌకర్యాలను కల్పించారు. ఏపీఎస్ఆర్టీసీ రూ.3 కోట్ల నిధులతో గతేడాది మేలో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో అంత ఖర్చుతో బస్సు కొనుగోలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్య లేఖలో ప్రశ్నించారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుతో పాటు ప్యాంట్రీ వాహనానికి ఆర్టీసీ రూ.30.94 లక్షలు వెచ్చించింది. ఈ నిధుల్ని తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement