
పోలవరం నిర్వాసితులపై బలప్రయోగం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది.
పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అగులూరులో మంగళవారం ఇళ్లు, చెట్లు కూల్చివేసింది. అంగులూరులో మొత్తం 71 ఇళ్లు ఉన్నాయి. 2008లో ఆర్‌ఆర్ ప్యాకేజ్ కింద ఒక్కో ఇంటికి రూ. లక్షా 55వేలు, ఎకరాకు లక్షా పది వేల రూపాయల చొప్పున చెల్లించారు.
ఈ పరిహారం చాలదని నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయలేదు. ఐదేళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. ఈలోగా భూముల ధరలు మరింత పెరిగాయి. కొత్త ప్యాకేజీ ప్రకటించకుండా, ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసును మొహరించి ఇళ్లను, చెట్లను కూల్చివేయిస్తుండటంతో అంగలూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.