
సాక్షి, అమరావతి : విభజనతో నష్టపోయినప్పటికీ మిగతా రాష్ట్రాలకంటే వేగంగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతున్నదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. 11.3 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం పరుగులు పెడుతున్నదని, అది జాతీయ సగటు 6.97 కంటే చాలా ఎక్కువని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
కరువును తరిమేశాం : విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గవర్నర్ అన్నారు. రైల్వేజోన్‌తోపాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నిరవేర్చాల్సిఉందని, 9,10వ షెడ్యూళ్లలోని ఆస్తుల పంపిణీ కూడా పూర్తిచేయాల్సిఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని, వ్యవసాయం, పారిశ్రామిక, విద్య, వైద్య, ఉపాధి, ఐటీ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశామని, అనంతపురంలో కరువును పారద్రోలామని, పరిశ్రమల స్థాపనతో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బాటలు వేశామని, రియల్ టైమ్ గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత చేరువయ్యామని బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment