ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు
ఉపాధ్యక్షురాలిగా జాగర్లమూడి కోటేశ్వరిదేవి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా చిత్తరువు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తరువాత సంఘానికి తొలిసారి గురువారం జరిగిన ఎన్నికల్లో ఎంఎస్.ప్రసాద్‌పై నాగేశ్వరరావు 41 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సంఘం అధ్యక్షుడిగా నాగేశ్వరరావు పనిచేశారు. ఉపాధ్యక్షురాలిగా జాగర్లమూడి కోటేశ్వరిదేవి, కార్యదర్శులుగా భాస్కరరావు జోస్యుల, తుహిన్ కుమార్ గెడ్డెల, సంయుక్త కార్యదర్శిగా చేజర్ల సుబోధ్, కోశాధికారిగా సుంకర హేమలత గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎస్.వి.భువనేశ్వరి, కొప్పర్తి సుమతి, సి.బి.ఆదర్శకుమార్, ఎం.ఢిల్లీబాబు, ఎన్.నిర్మలకుమార్, ిసీహెచ్.సాయి విష్ణువర్థన్, ఈర్ల సతీష్‌కుమార్, వేణుగోపాల్ తూము తదితరులు విజయం సాధించారు.