నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published Wed, Mar 12 2014 2:33 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంతవరకూ ఆకాశమే హద్దుగా ఆడుతూ..పాడుతూ,,ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచిజరగనున్న ఇంటర్మీ డియెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రథమ- బుధవారం నుంచి, ద్వితీయ- గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియెట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ)ఎల్‌ఆర్ .బాబాజీ తెలిపారు. మంగళవారం ఆర్‌ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న 170 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 22,410 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 25,427 మంది విద్యార్థులు రాయనున్నారని చెప్పారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే శామని తెలిపారు. 138 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 138 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, ఐదుగురు సిట్టింగ్ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయని, ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానం అమలు చేయనున్నామన్నారు.
అరగంట ముందే చేరుకోవాలి
ఈ ఏడాది పరీక్షల సమయపాలనలో స్వల్ప మార్పులు చేశామని చెప్పారు. గత ఏడాది ఉదయం 9 గంటల లోపు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తప్పనిసరిగా చేరుకోవాలనే నిబంధన విధించగా ఈ ఏడాది ఆ సమయాన్ని కాస్తా కుదించామన్నారు. అరగంట ముందు ఉదయం 8.30గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరు కోవాలని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలను 8.45గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలిస్తారని, విద్యార్థికి ప్రశ్నపత్రం ఇచ్చిన తరువాత ఏకారణం చేతనైనా మాట్లాడించడం, ప్రశ్నలు వేయడం చేయకూడదన్నారు. కేంద్రాల్లో ఫర్నిచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
వెబ్‌సైట్ ద్వారా ‘హాల్‌టిక్కెట్’
కళాశాల యాజమాన్యం ఏ కారణం చేతనైనా హాల్‌టిక్కెట్ ఇవ్వని నేపథ్యంలో విద్యార్థి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి రాకూడదని ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోటీ పరీక్షల మాదిరిగానే అభ్యర్థి నేరుగా హాల్‌టిక్కెట్‌ను ‘బిఐఇఏపీ.సీజీజీ.జీఓవీటీ.ఐఎన్’ వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థికిచ్చిన జవాబు బుక్‌లెట్ 24పేజీలున్నాయో లేదో చూసుకోవాలి (అడిషినల్ జవాబుపత్రం ఇవ్వరు)
పరీక్షకేంద్రానికి 30 నిమిషాల ముందు హాజరు కావాలి. ఈ సమయం దాటితే పరీక్షకు అనుమతి ఇవ్వరు.
అంధవిద్యార్థికి స్క్రైబ్ (సహాయకుడు)అర్హత డిగ్రీ చదువుతో సమానంగా ఉండాలి. సంబంధిత కోర్సులు చదివి ఉండకూడదు.
ఓఎంఆర్ బార్‌కోడెడ్ షీటులోని పార్టు-3లో అభ్యర్థి ఏమైనా మార్పులు చేసినటై్లతే పబ్లిక్ పరీక్షలలో అనుచిత ప్రవర్తనగా పరిగణిస్తారు.
సెల్‌ఫోన్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడానికి అనుమతి లేదు.
Advertisement