![AP Mala Corporation Chair Person Ammaji fires On Doctor Sudhakar - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/18/12.jpg.webp?itok=GvyObGji)
సాక్షి, విజయవాడ: ఏ వంకా చిక్కకపోతే డొంక పట్టుకొని ఆడినట్టుంది టీడీపీ ,సిపిఐ, డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ అని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అమ్మాజీ మండిపడ్డారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాడని, పవిత్రమైన వృత్తిలో ఉండి టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. సోమవారం ఆమె విజయవాడలో మాట్లాడుతూ... డాక్టర్ సుధాకర్ కులం కార్డుని అడ్డుపెట్టుకొని తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంట్లో డాక్టర్ సుధాకర్‌కు తర్ఫీదు ఇచ్చారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయి. కరోనా సమయంలో టీడీపీ నేతలు మాయమయ్యారు. అసలు ఉన్నారో లేదో కూడా అనుమానం వస్తోంది. తప్పతాగి నడిరోడ్డుపై నోరు పారేసుకున్న సుధాకర్‌కు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ వత్తాసు పలకడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేస్తోన్న మంచి పనులను టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అభినందిస్తున్నారు. సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి చంద్రబాబుకి పిచ్చెక్కినట్టుంది. చంద్రబాబాబు దళితులకి ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఏడాది కాలంలోనే సీఎం జగన్ దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారు అని అమ్మాజి పేర్కొన్నారు. (వలస జీవులకు ఏపీ ప్రభుత్వం అండ)
ఇంకా ఆమె మాట్లాడుతూ... ప్రతి చిన్న విషయానికి లేఖలు రాయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని, చంద్రబాబు ఇకనైన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేకపోతే ఇప్పుడు వచ్చిన 23 సీట్లు భవిష్యత్తులో సింగిల్ డిజిట్‌కి చేరడం ఖాయమన్నారు. (ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment