Ammaji
-
మంచి నీళ్లే ఆహారం.. రూ.80 కోట్లు మోసపోయాడు: పూరీ తల్లి
టాలీవుడ్ తోపు డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన బద్రి సినిమాతో దర్శకరచయితగా కెరీర్ ఆరంభించాడు. ఇడియట్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఈయన తనయుడు ఆకాశ్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా పూరీ తల్లి అమ్మాజీ తన కుమారుడి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. తన కష్టం చూసి ఏడ్చేశా.. ఆమె మాట్లాడుతూ.. 'ఏడో తరగతి నుంచే పూరీకి సినిమాలంటే ఇష్టం. అనకాపల్లిలో డిగ్రీ చదివాడు. తను సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో ఇంటి నుంచి డబ్బులు పంపించేవాళ్లం. అవి సరిపోక తను కూడా కష్టపడేవాడు. ఆఫీసుల చుట్టూ కాలినడకన తిరిగేవాడు. ఒకసారి నేను వెళ్లినప్పుడు తన పాదాలు వాచిపోయి సాక్సులు వేసుకోవడానికి రాలేదు. అది చూసి ఏడ్చేశాను. ఇంత కష్టమెందుకు? ఊరికి వచ్చేయ్, పొలం పని చేసుకుందామన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. దేవుడు నా కష్టం చూడకపోతాడా? అని అలాగే ప్రయత్నించాడు. పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్నం తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగిన రోజులున్నాయి. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదు. కోట్లు మోసం చేశాడు పూరీ దగ్గర పనిచేసే ఓ కుర్రాడు దాదాపు రూ.80 కోట్లు కొట్టేశాడు. మేమందరం ఏడ్చేశాం. ఓ సినిమా తీసి కూడా నష్టపోయాడు. ఈ అప్పు తీర్చేందుకు ఐదారు ఇళ్లు అమ్మేశాడు. తనను మోసం చేసినవాడి కాళ్లూచేతులు విరిచేద్దామా అని ఎవరో సలహా ఇస్తే ఒప్పుకోలేదు. ఏ జన్మలో అతడికి రుణపడి ఉన్నామో అని వదిలేశాడు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు కష్టపడతానన్నాడు. నా కుమారుడు అంతటి దయామయుడు. ఒకసారి ఓ వ్యక్తి సాయం కావాలని వస్తే ఇంట్లో ఉన్న రూ.4 లక్షలూ ఇచ్చేశాడు. తనకంటూ ఏదీ ఉంచుకోడు. ఊరిలో కూడా ఓ గుడి కట్టించాడు' అని చెప్పుకొచ్చింది అమ్మాజి. చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? -
మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే: పెద్దపాటి అమ్మాజీ
సాక్షి, కాకినాడ: ఏపీలో మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతిచ్చారు. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులేనని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ మండిపడ్డారు. కాగా, పెద్దపాటి అమ్మాజీ ఆదివారం తునిలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే. డిస్టిలరీలకు అనుమతులు కావాలంటే గతంలో భువనేశ్వరిని కలిసేవారని విన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ఎలా బురద చల్లాలో తెలియక మద్యం స్కామ్ అంటూ బురద చల్లుతున్నారు. మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతి ఇచ్చారని అన్నారు. -
‘చంద్రబాబు, హర్షకుమార్ హస్తం ఉంది’
సాక్షి, తాడేపల్లి: ‘హర్షకుమార్కు సరదాగా ఉంటే నక్షలైట్లలో చేరాలి. ఆయనతో పాటు చంద్రబాబు కూడా నక్సలైట్లలో చేరాలి. అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు’ అంటూ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత యువకుడి శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దళిత బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. అంతేకాక బాధిత బాలికకు ప్రభుత్వం పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని తెలిపారు. చంద్రబాబు దళితులను నీచంగా చూశారని అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెదపలేదన్నారు. దళితుల కోసం మీడియా సమావేశం పెట్టిన హర్షకుమార్ మూడు రాజధానులు కోసం ఎందుకు మాట్లాడుతున్నారని అమ్మాజీ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న నిన్ను ఎవరూ నమ్మరు: కనకరావు హర్షకుమార్, చంద్రబాబు మీద మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌ల్లో హర్షకుమార్ ఒకరు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి అతడు కక్కుర్తి పడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్ దళిత సమస్యలపై పోరాటం చేస్తామంటే ఎవరూ నమ్మరు. దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి. ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక చంద్రబాబు, హర్షకుమార్ ఉన్నారు’ అని ఆయన ఆరోపించారు. అంతేకాక ‘యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మక్కై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు. అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు. రాజధానిలో దళితుల భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెదపలేదు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబుకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి. వారి సంక్షేమం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు’ అన్నారు కనకరావు. -
కిరణ్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే శ్రీదేవి
సాక్షి, తాడికొండ: తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్ఐ దాడిచేసి కొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కిరణ్ కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెడపాటి అమ్మాజీతో కలిసి మంగళవారం చీరాలలో కిరణ్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడిన అనంతరం చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి తన సొంత నగదు రూ.1 లక్షను కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగిన కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో దళిత యువకుడికి శిరోముండనం కేసు, చీరాల ఘటనల్లో సంబంధిత వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. చీరాల ఘటనలో ఎస్ఐను అరెస్టు చేయడంతో పాటు కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. (మాస్కు వివాదం.. యువకుడి బలి) సీఎం జగన్ దళితుల పక్షపాతి అని, తప్పుచేస్తే ఎవరినీ క్షమించరన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఘటనలో ఇన్చార్జి ఎస్ఐ షేక్ ఫిరోజ్ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి ఎస్ఐపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారన్నారు. విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకలి్పంచడం ఆయనకు దళితులపై ఉన్న మక్కువకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందని ద్రాక్షగా ఉండే ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతుంటే అడ్డుకోవాలని కుటిల బుద్ధితో కేసులు వేయించిన చంద్రబాబు దళిత ద్రోహి అన్నారు. మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు అంటూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కనీసం మందలించకపోగా ఆదే వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సత్కరించారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు గతంలో అన్న మాటలు మరచి దళితులపై మొసలి కన్నీరు కార్చడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. (రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ) -
హర్షకుమార్ క్షమాపణలు చెప్పాలి
-
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో బాబూ
సాక్షి, అమరావతి: దళితులకు మేలు చేయడమెలాగో అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేర్చుకోవాల్సిందని.. కానీ అది జరగలేదని, కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సీఎం వైఎస్ జగన్‌ని చూసైనా నేర్చుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ఘటన జరిగిన 24 గంటల్లోనే దానికి బాధ్యులైన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. అంతేకాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపామన్నారు. దేశంలో, చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఇంత వేగంగా స్పందించిన దాఖలాలే లేవన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులు ఎప్పటికీ పాకల్లో మగ్గాలన్నదే ఆయన ఉద్దేశమని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వారు ఎక్కడ బాగుపడిపోతారో అని అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్ మీడియంను కూడా అందుకే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆయన చేసే నీచ రాజకీయాలు ప్రపంచంలో మరెవరూ చేయరన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమ్మాజీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా ఆమె ఏమన్నారంటే.. ► కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి సంక్షేమ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశం. దళితులకు, దళితులకు, దళితులకు, ఓసీలకు మధ్య చిచ్చు పెడితే ఆయన చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారు. ► దళితులకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 30 లక్షల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందిస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపింది.. చంద్రబాబే. ► చంద్రబాబు దళిత ద్రోహి అనేది దేశం మొత్తానికి తెలుసు. ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎం. ఆయన 14 ఏళ్ల పరిపాలన గమనిస్తే ఇది అర్థమవుతుంది. ► దళిత ద్రోహి ఎవరు అని గూగుల్‌ని అడిగినా బాబు పేరే వస్తుంది. ఆయన మానసిక ఆరోగ్యంపై ప్రజలకు సందేహాలు ఉన్నాయి. టెస్టు చేయించుకున్నాకే ఆయన మీడియాతో మాట్లాడాలి. ► తన 40 ఏళ్ల ఇండస్ట్రీలో దాచుకోవడం.. దోచుకోవడం తప్పితే బాబు దళితులకు చేసింది ఏమీ లేదు. ► దళిత సంక్షేమం విషయంలో ఏ ఒక్క అంశంలోనైనా సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు సరితూగగలడా? ► బాబు వస్తే.. జాబు వస్తుందని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు కనిపించకుండా చేసిన ఘనుడు.. బాబు. ► సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే బాబుకు ఎందుకు కడుపు మంట? సీఎం ఏడాదిలోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల పేద విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఉచితంగా చదువులు చెప్పిస్తుంటే బాబుకు ఎందుకు ఏడుపు? ► సీఎం వైఎస్ జగన్ పరిపాలనను దేశవిదేశాల్లోని ప్రజలు, మేధావులు మెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ► హత్యా రాజకీయాలు చేయడం బాబుకు అలవాటు. పిల్లనిచ్చిన మామను అధికారం నుంచి దింపి ఆయన చావుకు కారణమయ్యారు. -
‘అయ్యన్న పాత్రుడి ఇంట్లోనే ఆయనకు తర్ఫీదు ఇచ్చారు’
సాక్షి, విజయవాడ: ఏ వంకా చిక్కకపోతే డొంక పట్టుకొని ఆడినట్టుంది టీడీపీ ,సిపిఐ, డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ అని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ మండిపడ్డారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాడని, పవిత్రమైన వృత్తిలో ఉండి టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నాడని ఆమె ధ్వజమెత్తారు. సోమవారం ఆమె విజయవాడలో మాట్లాడుతూ... డాక్టర్ సుధాకర్ కులం కార్డుని అడ్డుపెట్టుకొని తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంట్లో డాక్టర్ సుధాకర్‌కు తర్ఫీదు ఇచ్చారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయి. కరోనా సమయంలో టీడీపీ నేతలు మాయమయ్యారు. అసలు ఉన్నారో లేదో కూడా అనుమానం వస్తోంది. తప్పతాగి నడిరోడ్డుపై నోరు పారేసుకున్న సుధాకర్‌కు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ వత్తాసు పలకడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న మంచి పనులను టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అభినందిస్తున్నారు. సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి చంద్రబాబుకి పిచ్చెక్కినట్టుంది. చంద్రబాబాబు దళితులకి ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఏడాది కాలంలోనే సీఎం జగన్ దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారు అని అమ్మాజి పేర్కొన్నారు. (వలస జీవులకు ఏపీ ప్రభుత్వం అండ) ఇంకా ఆమె మాట్లాడుతూ... ప్రతి చిన్న విషయానికి లేఖలు రాయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని, చంద్రబాబు ఇకనైన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేకపోతే ఇప్పుడు వచ్చిన 23 సీట్లు భవిష్యత్తులో సింగిల్ డిజిట్‌కి చేరడం ఖాయమన్నారు. (ఐదుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్) -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా : అమ్మాజీ
సాక్షి, అమరావతి : మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంస్థకు చైర్‌పర్సన్‌గా తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పి. అమ్మాజీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సీహెచ్ వేణుగోపాల్ కృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మాజీ మాట్లాడుతూ.. 2001లో రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో వార్డు కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో ఉన్నత స్థాయికి చేరిందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేను చేసిన కృషిని గుర్తించిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టిన తాను ముఖ్యమంత్రి సారథ్యంలో అవినీతికి తావు లేకుండా ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని సంకల్పించారు. -
చంద్రబాబుకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు
కోటనందూరు: రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సీఎం చంద్రబాబుకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఆశ చూపించి సంతలో పశువుల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు నేడు ప్రతిపక్ష పార్టీ ప్రజాదరణను చూసి వణికిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి సాగనింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగించిన చంద్రబాబు చెర నుంచి నేతలంతా నేడు ప్రజా నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూటికి చేరుతున్నారన్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యేలు ఆమంచి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు, హీరో జూని యర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు, సినిమా హీరోయిన్ జయసుధ ఇలా అనేక మంది అతిర«థ మహార«థులంతా ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని జగనన్న వాగ్దానాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని, అందుకోసం ఎంతటికైనా దిగజారతారని ఆరోపించారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రజల సమాచారాన్నంతటినీ ఐటీ గ్రిడ్ అనే చిన్న సంస్థకు అప్పగించారన్నారు. ఈ దుశ్చర్యకు రెండేళ్ల క్రితమే బీజం వేశారని, మా పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరించి గుట్టును రట్టు చేయడంతో మొత్తం వ్యవహారమంతా బ యటపడిందన్నారు. సోమవారం కాకినాడలో జరగనున్న సమర శంఖారావా నికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కొడుకు మ్యారేజ్‌డేకి వెళ్లొస్తూ తల్లి దుర్మరణం
గొడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం నక్కపల్లి : మ్యారేజిడే వేడుకకు వెళ్లి వస్తుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా ఏడుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ రేసపువానిపాలెంలో ఏయూ రిటైర్డు ప్రొఫెసర్ దాసరి ప్రభాకర్‌రావు కుటుంబం నివసిస్తోంది . ఈయన భార్య అమ్మాజీ(60) కూడా బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. వీరి ఏకైక కుమారుడు సందీప్ కాకినాడలో రిలయన్స్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సందీప్ పెళ్లి రోజు. దీంతో కుమారుడి పెళ్లిరోజు వేడుకకు హాజరయ్యేందుకు ప్రభాకరరావు కుటుంబ సభ్యులు కాకినాడ వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక సోమవారం వీరంతా తిరుగుప్రయాణమయ్యారు. కొడుకు సందీప్ కారులో వీరంతా విశాఖ బయలుదేరారు. రాత్రి 8గంటలప్రాంతంలో కారు మండలంలోని గొడిచర్లసమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అడ్డొచ్చింది. దీన్ని తప్పించే ప్రయత్నంలో కారు పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీలుకొట్టింది. ఈ ఘటనలో సందీప్ తల్లి అమ్మాజీ అక్కడికక్కడే మరణించారు. ప్రభాకర్‌రావుకు కాలు విరిగిపోయింది. తలకు బలమైన గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న సందీప్ కాలు కూడా విరిగిపోయింది. నడుంకు బలమైన గాయమైంది. మేనకోడలు తేజస్విని తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. చంద్రిక, సంధ్యలతోపాటు రెండేళ్ల చిన్నారి ప్రణవి కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులను విశాఖ దిగబెడదామని బయలుదేరానని ఇంతలో ప్రమాదం సంభవించిందని సందీప్ సాక్షికి తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో తుని ఏరియా ఆస్పత్రి మారుమోగింది. తునిలో ఉన్న సందీప్ బంధువులు ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి బాధితులకు సపర్యలు చేశారు. ఏరియా ఆస్పత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తరలించారు. -
‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు మేలు
నర్కూడ (శంషాబాద్ రూరల్ ): రైతులు ‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా సమయం కలిసివస్తుందని డాట్ శాస్త్రవేత్త డాక్టర్ అమ్మాజీ సూచించారు. శుక్రవారం మండలంలోని నర్కూడలో రైతు రామారావు వ్యవసాయ క్షేత్రంలో పొలం బడి నిర్వహించారు. వరి సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులు అదే పొలంలో దున్నే అవసరం లేకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను నేరుగా విత్తుకోవచ్చన్నారు. ఇందులో కలుపు నివారణకు అట్రాజిన్ కలుపు మందు పిచికారీ చేయాలన్నారు. ఈ పద్ధతిలో నెల సమయం ఆదా కావడమే కాకుండా పంట త్వరగా కోతకు వస్తుందన్నారు. వరి పంటకు ప్రస్తుత వాతావరణం కారణంగా కంకినల్లి, దోమ తెగుళ్లు ఆశించినట్లు తెలిపారు. కంకినల్లి నివారణ కోసం డైకోఫాల్ 2 మి.లీ. ఒక లీటరు నీళ్లలో కలిపి లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ను ఒక లీటరు నీళ్లలో కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. పంటలో పొట్ట ఆకుపై గోధుమరంగు చారలు కనిపించిన వెంటనే మందులను పిచికారీ చేస్తే గింజలు రంగు మారడం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా వరిలో తెగుళ్లు ఆశించకుండా రైతులు తప్పనిసరిగా కాలిబాటను వదులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మోహన్‌రెడ్డి, ఇన్చార్జి ఏఓ విద్యాధరి, ఏఈఓలు ఉదయ్‌సింగ్, రాఘవేందర్, ‘ఆత్మ’ బీటీఎం సూర్యమూర్తి, ఎస్ఎంఎస్ జ్యోత్స్న పాల్గొన్నారు.