చంద్రబాబుకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు | YSRCP Leader Ammaji Slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు

Published Mon, Mar 11 2019 1:19 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YSRCP Leader Ammaji Slams Chandrababu naidu - Sakshi

పెదపాటి అమ్మాజీ ,చంద్రబాబు

కోటనందూరు: రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సీఎం చంద్రబాబుకు ఈ  రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఆశ చూపించి సంతలో పశువుల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు నేడు ప్రతిపక్ష పార్టీ ప్రజాదరణను చూసి వణికిపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి సాగనింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగించిన చంద్రబాబు చెర నుంచి నేతలంతా నేడు ప్రజా నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గూటికి చేరుతున్నారన్నారు.

అందులో భాగంగానే  తెలుగుదేశం పార్టీ ఎంపీలు పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,  ఎమ్మెల్యేలు ఆమంచి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పారిశ్రామిక వేత్త  రఘురామ కృష్ణంరాజు, హీరో జూని యర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు, సినిమా హీరోయిన్‌ జయసుధ ఇలా అనేక మంది అతిర«థ మహార«థులంతా ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని జగనన్న వాగ్దానాలకు ఆకర్షితులై వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని, అందుకోసం ఎంతటికైనా దిగజారతారని ఆరోపించారు. అందులో భాగంగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రజల సమాచారాన్నంతటినీ ఐటీ గ్రిడ్‌ అనే చిన్న సంస్థకు అప్పగించారన్నారు.  ఈ దుశ్చర్యకు రెండేళ్ల  క్రితమే బీజం వేశారని, మా పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరించి గుట్టును రట్టు చేయడంతో మొత్తం వ్యవహారమంతా బ యటపడిందన్నారు. సోమవారం కాకినాడలో జరగనున్న సమర శంఖారావా నికి జిల్లా నలుమూలల నుంచి  పార్టీ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement