సాక్షి, అమరావతి : మాల సంక్షేమ సహకార ఆర్ధిక సంస్థకు చైర్‌పర్సన్‌గా తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో పి. అమ్మాజీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సీహెచ్ వేణుగోపాల్ కృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మాజీ మాట్లాడుతూ.. 2001లో రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలో వార్డు కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయతో ఉన్నత స్థాయికి చేరిందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేను చేసిన కృషిని గుర్తించిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టిన తాను ముఖ్యమంత్రి సారథ్యంలో అవినీతికి తావు లేకుండా ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని సంకల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment