సాక్షి, విజయవాడ: వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యులు, సిబ్బందిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రజలు సహకరిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
‘‘చిన్న చిన్న టైపింగ్ పొరపాట్లను పని గట్టుకుని ఎత్తి చూపి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైద్య శాఖ ఇచ్చే సమాచారం పై ఎవ్వరికీ సందేహాలున్న సంప్రదించొచ్చు. పూర్తి పారదర్శకంగా కరోనా వైద్య పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రాల్లో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేదు.. అలాంటిది ఇప్పుడు రోజుకి 2300 పరీక్షల సామర్థ్యం గల వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాం. ఇప్పటి వరకు 21450 మందికి కరోనా పరీక్షలు జరిపాం. రోజుకి 17, 500 టెస్టులు చేసే సామర్థ్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం వైరల్ ల్యాబ్‌లతో పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకున్నాం. లక్ష ర్యాపిడ్ కిట్లు, 50 వేల టెస్టింగ్ కిట్ల కు కొనుగోలు ఉత్తర్వులు ఇచ్చామని’’ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment