
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిది నెలల కిందటే చంద్రబాబును టీడీపీ పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారని విమర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయంటున్నారు.. మరి ఇతర ప్రాంతాల్లో రావా? ముంబై, చెన్నై నగరాలు సముద్ర తీరం వద్దే ఉన్న విషయం చంద్రబాబు అండ్ టీంకు తెలియదా? ఎల్లో మీడియా అడ్డు పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో ఇటీవలే భూకంపం వచ్చింది. మరి భూకంపంవచ్చే ప్రాంతంలో చంద్రబాబు రాజధాని ఎందుకు పెట్టారు?’అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశించారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలి టన్ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుందని రాజధాని ప్రాంతంపై సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
విశాఖే ఉత్తమం
Comments
Please login to add a commentAdd a comment