
వరద బాధితులతో మాట్లాడుతున్న మంత్రులు
సాక్షి, దేవీపట్నం : తూర్పుగోదావరి ఏజెన్సీలోని పోచమ్మ గండి, దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు బాలరాజు, రాజా, ధనలక్ష్మి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పబ్లిసిటీకి చేసిన ఖర్చు నిర్వాసితుల పునరావాసానికి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. సోమవారం పోలవరం అంటూ ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. అనాలోచితంగా కాపర్ డ్యాం నిర్మించడం వల్లే దేవిపట్నం మండలంతో సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment