సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదింట వెలుగులు తెచ్చింది. సాంఘిక, ఆర్థిక, సామాజిక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంతో పాటు అభివృద్ధి, సంక్షేమ, మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేసింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, ఒంటిమిట్ట(కడప) : అధికారం చేపట్టిన రెండు నెలల లోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వం లో రాష్ట్ర మంత్రి మండలి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్యుత్ వినియోగంపై రాయితీని ప్రకటించింది. ఇప్పటి వరకు 100 యూనిట్ల విద్యుత్‌ను వాడిన వారికి బిల్లు రాయితీని టీడీపీ ప్రభుత్వం మొదటి, రెండు సంవత్సరాల్లో ఇచ్చింది. మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సైతం దారిమల్లించారు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల లోపు విద్యుత్‌లో రాయితీ అమలు నిలిచిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 100 యూనిట్లు వినియోగం ఉచితం పై విద్యుత్ శాఖ అ«ధికారులు పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదన్న ఆరోపణలు వెళ్లువెత్తాయి. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడినా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. సీఎం నిర్ణయంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హామీని నిలబెట్టుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 200 యూనిట్ల విద్యుత్ వాడకంపై రాయితీ కల్పించడం సంతోషంగా ఉంది. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. 200 యూనిట్ల విద్యుత్ రాయితీ ఆన్‌లైన్ చేయడానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలపై అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
–రాముడు, జ్యోతి ఎస్టీ కాలనీ, సిద్దవటం మండలం
ఆర్థిక భరోసా కలుగుతుంది
సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీవనమే కష్టతరంగా మారింది. ఈ పరిస్థితిలో ఉచిత విద్యుత్‌ను 200యూనిట్ల వరకు పెంచడంతో ఆర్థికంగా భరోసా కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– రమాదేవి, ఒంటిమిట్టఆర్థిక భరోసా కలుగుతుంది
సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో జీవనమే కష్టతరంగా మారింది. ఈ పరిస్థితిలో ఉచిత విద్యుత్‌ను 200యూనిట్ల వరకు పెంచడంతో ఆర్థికంగా భరోసా కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– రమాదేవి, ఒంటిమిట్ట
Comments
Please login to add a commentAdd a comment