
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా నివేదిక రూపొందించామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. (చదవండి : రైతుల కోసం జగన్ సర్కార్ మరో ముందడుగు)
ఏపీ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికలోని ముఖ్యాంశాలు
► ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)
►1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదల
►స్థిర ధరల్లో 8.16 శాతం జీఎస్‌డీపీ పెరుగుదల (దేశంలో సగటున 5శాతం మాత్రమే)
►స్థిర ధరల్లో జీఎస్‌డీపీ 6,72,018 కోట్ల రూపాయలు
►వ్యవసాయంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ)
►11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ
►పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి
►సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి
►రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల
►తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల (దేశ సరాసరి తలసరి ఆదాయం 1.34 లక్షలు మాత్రమే)
►రాష్ట్రంలో గత ఏడాది అక్షరాస్యత 67.35 శాతం
Comments
Please login to add a commentAdd a comment